Credit Score: మీ క్రెడిట్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉంటే మీకెన్ని లాభాలో తెలుసా?

Published : Oct 06, 2025, 09:54 AM IST

మంచి క్రెడిట్ స్కోర్ (Credit Score) ఉంటేనే బ్యాంకులు మీకు ఎన్నో అవకాశాలు, లాభాలను అందిస్తుంది.  వేగంగా లోన్ ఆమోదం పొందాలన్నా, తక్కువ వడ్డీ రేట్లు కావాలన్నా, ఎక్కువ రుణ మొత్తం కావాలన్నా కూడా క్రెడిట్ స్కోర్ అధికంగా ఉండాలి.

PREV
14
క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటే లాభాలు

మంచి క్రెడిట్ స్కోర్ అంటే 750కి పైగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్యాంకులు, NBFCల నుంచి మీకు రిస్క్ చాలా తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ అధికంగా ఉండడం వల్ల మీకు కావాల్సిన లోన్ త్వరగా ఆమోదం పొందుతుంది.  అలాగే డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా సులభంగా మారుతుంది. మీ పేమెంట్ హిస్టరీ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. అలా ఉంటే బ్యాంకులు మీ దరఖాస్తును వెంటనే ప్రాసెస్ చేస్తుంది. 750కి పైగా క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు బ్యాంకులు, NBFCలు వడ్డీ రేట్లు చాలా తగ్గుతాయి.

24
క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటే ప్రయోజనాలు

క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్నవారికి వ్యక్తిగత రుణం, గృహ రుణం అనేవి త్వరగా వస్తాయి. అలాగే తక్కువ వడ్డీకి లోన్ పొందే అవకాశం ఉంది. క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటే మీపై బ్యాంకుకు నమ్మకం పెరుగుతుంది. మీకిచ్చే రుణ మొత్తం బ్యాంకులు కూడా పెంచుతాయిి. ఎక్కువ స్కోర్ ఉన్న కస్టమర్లకు లోన్ ఆమోదానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మీకు అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు వెంటనే ఆమోదం తెలుపుతాయి.

34
బ్యాంకుతో మాట్లాడి

మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే వడ్డీ రేటు రుణ మొత్తం తిరిగి చెల్లించే నిబంధనల గురించి బ్యాంకుతో  చర్చించవచ్చు. కొన్ని బ్యాంకులు, NBFCలు ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు త్వరగా అందిస్తాయ.  సరైన సమయంలో EMI లు చెల్లించడం, బిల్లులు చెల్లించడం వంటివి చేస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.

44
క్రెడిట్ స్కోర్ చిట్కాలు

ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండటం వల్ల మీకు కావాల్సిన లోన్ త్వరగా ఆమోదం పొందుతుంది. మీ క్రెడిట్ హిస్టరీ స్పష్టంగా ఉండటం వల్ల  మీ లోన్ లేదా క్రెడిట్ కార్డుకు వేగంగా ఆమోదం లభిస్తుంది. దీనివల్ల డబ్బు సర్దుబాటుకు కష్టం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories