ప్రగతి ఓఎస్ అంటే ఏమిటి?
రిలయన్స్ జియోకి చెందిన జియోఫోన్ నెక్స్ట్ కోసం ఆండ్రాయిడ్ గో ఎకోసిస్టమ్‌ను ఉపయోగించాలని చూస్తోందని ఇప్పటికే తెలుసు. కొత్త పేరు ప్రగతి ఓఎస్ అండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ పైన సాఫ్ట్‌వేర్ స్కిన్‌గా ఉండే అవకాశం ఉంది. అండ్రాయిడ్ గో అనేది అండ్రాయిడ్ స్ట్రిప్డ్ డౌన్ వెర్షన్, అంటే లిమిటెడ్ హార్డ్‌వేర్ సామర్థ్యాలతో లో-ఎండ్ ఫోన్‌లకు సపోర్ట్ చేయడానికి ఉద్దేశించింది.
గూగుల్ భాగస్వామ్యంతో రూపొందించిన కొత్త ఓఎస్ ఎంట్రీ-లెవల్ కస్టమర్‌లకు అందించే ఎన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రగతి ఓఎస్ ను భారత్ కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లు రిలయన్స్ చెబుతోంది. "బడ్జెట్ ధరలో అతుకులు లేని అనుభవాన్ని అందించడానికి, అందరికీ ప్రగతి (ప్రోగ్రెస్) అందించాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని టాప్ టెక్నీషియన్లు రూపొందించారు" అని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.