"జియో భారత్ UPI పేమెంట్స్ కి కూడా సపోర్ట్ ఇస్తుంది. జియో భారత్‌తో అత్యంత వెనుకబడినవారు కూడా ఇప్పుడు క్యాష్ లెస్ గా మారవచ్చు. అలాగే ఈ ఫోన్ పేమెంట్స్ స్మూత్ అండ్ ఈజిగా చేస్తుంది. చిన్న వ్యాపారులు ఇప్పుడు జియో భారత్ ద్వారా UPI పేమెంట్స్ అంగీకరించవచ్చు.
కంపెనీ అధికారుల ప్రకారం, UPI ఇంటిగ్రేషన్ ప్రభుత్వం నుండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ క్రమబద్ధీకరిస్తుంది ఇంకా UPI ద్వారా ఈజీ బ్యాలెన్స్ చెక్, రియల్-టైం నోటిఫికేషన్‌లతో ప్రజలు నేరుగా ప్రభుత్వ సపోర్ట్ పొందగలుగుతారు.
"2G-ముక్త్ భారత్‌ను రూపొందించే మా మిషన్‌ను వేగవంతం చేయడానికి, మేము జియో భారత్ కోసం అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా ప్లాట్‌ఫారమ్ రెండింటినీ ఇతర భాగస్వాములకు ఓపెన్ చేస్తున్నాము. రిలయన్స్‌తో పాటు, ఇప్పుడు కార్బన్ వంటి బ్రాండ్‌లు కూడా జియో భారత్ ఫోన్స్ ని సృష్టిస్తున్నాయి. జియో భారత్ రూపొందించిన వైబ్రెంట్ డివైజ్ ఎకోసిస్టమ్ సాధారణ భారతీయుల జీవితాన్ని మరింత ఆర్థికంగా, ఎడ్యుకేషన్ అండ్ ప్రభుత్వ సేవలతో సుసంపన్నం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము ”అని కంపెనీ చైర్మన్ అన్నారు.
గత సంవత్సరం AGMలో వరుస ప్రకటనలలో 66 ఏళ్ల ముఖేష్ అంబానీ Google సహకారంతో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసే ప్లాన్ ప్రకటించారు.
AGMకి ముందు బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో రెండు కొత్త జియో స్మార్ట్‌ఫోన్‌లు కనిపించాయని కొన్ని మీడియా నివేదికలు సూచించాయి. ఈ ఈవెంట్‌లో వాటికి సంబంధించిన ప్రకటనలు చేయవచ్చని ఊహాగానాలు చేస్తున్నారు.
జియో 5G ఫోన్(లు) భారతదేశ 5G విప్లవంలో కీలకం కావచ్చు, ఎందుకంటే చైనా కంపెనీలు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించే ఎంట్రీ-లెవల్‌కు మళ్లీ అనుకూలంగా ఉండవచ్చు.
మొత్తంగా 5G సొల్యూషన్‌లతో Jio 99% జనాభా కవరేజీతో మొబిలిటీ నెట్‌వర్క్‌ను నిర్మించింది, ఫైబర్‌తో 25 మిలియన్ల ఇళ్లకు చేరుకుంది. 9,000 ప్లస్ డిజిటల్ స్టోర్లు, 1 మిలియన్ కంటే ఎక్కువ బిజీనెస్ పార్టనర్స్, సుమారు 3 మిలియన్ల జియో అసోసియేట్స్ ద్వారా టెల్కో వైడ్ మార్కెట్ ని ఏర్పరచుకుంది.