రిలయన్స్ ఏజిఎం 2023: జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి ? ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ?

First Published Aug 28, 2023, 6:12 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ నేడు ఆగస్టు 28న టెలికాం విభాగం రిలయన్స్ జియో   ఎయిర్‌ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్‌ను వినాయక చవితి  అంటే సెప్టెంబర్ 19 నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రకటన గొప్ప విషయం అయినప్పటికీ అసలు AirFiber అంటే ఏమిటి? JioFiberకి AirFiber ఎలా భిన్నంగా ఉంటుంది?
 

Air ఇంటర్నెట్ ద్వారా

Jio ఆప్టికల్ ఫైబర్  బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్  JioFiber ఇప్పుడు భారతదేశం అంతటా 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను చేరుకుంది. సగటున ఒక కుటుంబం నెలకు 280GB డేటాను వినియోగిస్తుందని, అంటే  Jio  తలసరి మొబైల్ డేటా వినియోగం కంటే పది రెట్లు ఎక్కువ అని కంపెనీ తెలిపింది.

 వైర్డు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను సులభతరం చేయడానికి ఆర్కిటెక్చర్ అవసరం. సిటీ నగరాల్లో ఈ విషయం చాలా సమస్య కాదు, కానీ మారుమూల ప్రాంతాల్లో కనెక్షన్ కోసం అవసరమైన ఆప్టికల్ ఫైబర్‌ వేయడం సవాలుగా ఉంటుంది.

RIL AGM 2023 నుండి లేటెస్ట్  అప్‌డేట్స్ 

జియో  ఆప్టికల్ ఫైబర్ భారతదేశం అంతటా 1.5 మిలియన్ కి.మీ అంటే 15 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉందని, అయితే  ఇప్పటికీ ప్రతి ఇంటికి చేరుకోవడానికి ఈ రేంజ్ సరిపోదని చెప్పారు.

ఇక్కడే AirFiber వస్తుంది. Jio  5G డేటా నెట్‌వర్క్‌ని ఉపయోగించి, AirFiber ఇప్పటికే ఉన్న 5G టవర్‌ల నుండి డేటాను సేకరించడానికి ఇంకా  మీ ఇంటికి ప్రసారం చేయడానికి రిసీవర్‌లు అలాగే  రూటర్‌ల సెట్ ని ఉపయోగిస్తుంది.
 

అంటే సాధారణంగా ఇంటి లోపల  రూటర్ ఇంకా బయట 5G SIM ఉన్న డివైజ్  ఉంటుంది. డివైజ్ సమీపంలోని టవర్‌ల నుండి 5G డేటాను సేకరిస్తుంది అలాగే 1Gbps బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ తో   రూటర్‌కు ట్రాన్స్మిట్  చేస్తుంది.

దీని  స్పష్టమైన ప్రయోజనం ఏమిటంటే, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కష్టంగా ఉన్న మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం. ఇంకా ఇప్పటికే ఉన్న 5G టవర్లను కూడా ఉపయోగించుకుంటుంది. నెగటివ్ విషయం ఏమిటంటే మీరు నెట్‌వర్క్  సరిగా లేని ప్రాంతంలో ఉంటే ఈ బెనిఫిట్ మీ  కోసం కాకపోవచ్చు.

ప్లాన్స్   అండ్ ధర

ఆప్టికల్ ఫైబర్ తో ప్రతిరోజూ 15,000 గృహాలను కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది, అయితే AirFiberతో రోజుకు 150,000 కనెక్షన్‌లను చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని జియో తెలిపింది.

కంపెనీ ఇంకా వీటి అధికారిక ధర, ప్లాన్‌లను ప్రకటించలేదు, అయితే సెప్టెంబర్ 19న ఈ సర్వీస్‌ను ప్రారంభించనుంది.

click me!