నెలకు 172 రూపాయలే... 336 డేస్ వ్యాలిడిటీతో జియో సూపర్ రీచార్జ్ ప్లాన్

First Published | Aug 9, 2024, 4:19 PM IST

రీచార్జ్ ధరలు భారీగా పెంచడంతో జియో కస్టమర్ల జేబులకు చిల్లు పడింది. దీంతో మాంచి కాకమీదున్న కస్టమర్లను కూల్ చేసేలా ఓ సూపర్ రీచార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది జియో... అదేంటో చూడండి... 

Reliance Jio

Reliance Jio : జియో... ఈ పేరు టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది... ఇంకా తీసుకువస్తూనే వుంది. అయితే ఇటీవల జియో రీచార్జ్ ప్లాన్ ధరలను అమాంతం 25 శాతానికి పైగా పెంచడంతో వినియోగదారుల్లో అలజడి మొదలయ్యింది. కానీ రిలయన్స్ జియో యాజమాన్యం మాత్రం మరింత ఉత్తమ సేవలు అందించేందుకే కస్టమర్లపై భారం మోపక తప్పలేదంటోంది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటికీ పోటీ టెలికాం సంస్థలతో పోలిస్తే రిలయన్స్ జియో ప్లాన్స్ ధరలే తక్కువగా వున్నాయంటున్నారు.  

Reliance Jio

ఎంత సర్దిచెప్పుకున్నా రీఛార్జ్ ధరల పెంపు జియోలో కలకలం సృష్టించింది. ఇప్పటికే లక్షలాదిమంది కస్టమర్లు జియో నుండి ఇతర టెలికాం సంస్థలకు షిప్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఎక్కువమంది జియో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇలా వినియోగదారులు చేజారుతుండటంతో జాగ్రతుండటంతో జియో జాగ్రత్త పడుతోంది... మళ్ళీ తక్కువ ధరలతో ఎక్కవ లాభాలను అందించే రీచార్జ్ ప్లాన్స్ ను తెస్తోంది. ఇలాంటిదే రూ.1899 రీచార్జ్ ప్లాన్. 


Reliance Jio

వినియోగదారులు 336 రోజుల వ్యాలిడిటీతో రూ.1899 రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది జియో. అంటే ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా 11  నెలలపాటు అపరిమిత వాయిస్ కాల్స్ (ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్) పొందవచ్చు. అలాగే 24జిబి డాటా, 3600 ఎస్ఎంఎస్ లను పొందుతారు.  
 

Reliance Jio

ఈ రీచార్జ్ ప్లాన్ నెలవారిగా చూసుకుంటే కేవలం రూ.172 లే... 11 నెలలకు ఒకేసారి రీచార్జ్ చేసుకుంటున్నాం కాబట్టి రూ.1899 అవుతుంది. ఇదే జియోలో అతి తక్కువ రీచార్జ్ ప్లాన్ అని చెప్పాలి. అయితే ఈ ప్లాన్ ఎక్కువగా డాటా ఉపయోగించేవారికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. డాటా పెద్దగా అవసరం లేదనుకుంటే ఈ ప్లాన్ పొందవచ్చు. ఈ రీచార్జ్ తో జియో సినిమా, జియో టివి సబ్​స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. 
 

Reliance Jio

సేమ్ ఇలాంటి రీచార్జ్ ప్లానే జియోలో మరోటి కూడా వుంది. 84 రోజులు అంటే మూడు నెలల వ్యాలిడిటీతో రూ.479 ప్లాన్ ను కూడా జియో అందిస్తోంది. ఇది కూడా నెలకు దాదాపు రూ.160 పడుతుంది. ఈ ప్లాన్ లో కూడా డాటా చాలా తక్కువగా అంటే కేవలం 6జిబి మాత్రమే వస్తుంది.  

Latest Videos

click me!