ఆర్టిఫీషియల్ ఇన్‌టెలిజన్స్ దెబ్బ.. వేలల్లో ఉద్యోగాలకు కోత

First Published | Aug 9, 2024, 1:42 PM IST

ఆర్టిఫీషియల్ ఇన్‌టెలిజన్స్(AI) మరోమారు తన పంజా విసిరింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ తమ ఉద్యోగులను ఇళ్లకు పంపేస్తున్నాయి. 2023 నుంచి ఇది కొనసాగుతోంది. తాజాగా మరో దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ వేలల్లో తమ ఉద్యోగులను తొలగించింది. ఈ విషయం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

AIకి ప్రాధాన్యం ఇవ్వడానికే..

డెల్ కంపెనీ మరోసారి తమ సంస్థ ఉద్యోగాల్లో కోత విధించింది. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఆర్టిఫీషియల్ ఇన్‌టెలిజన్స్(AI) ఉత్పత్తులు, సేవలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకొని పోటీ కంపెనీలకంటే ముందుకెళ్లాలన్న లక్ష్యంతో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో టెక్ పరిశ్రమలో AI ప్రాముఖ్యత ఏవిధంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 

ఉద్యోగుల కోత వేలల్లోనే..

డెల్ ఎగ్జిక్యూటివ్‌లు బిల్ స్కానెల్, జాన్ బర్న్ తెలిపిన వివరాల ప్రకారం కంపెనీ నిర్వహణను సులభతరం చేసుకోవడానికి ఉద్యోగుల్లో కోత తప్పలేదన్నారు. అంతేకాకుండా AI సామర్థ్యాలను వినియోగించుకొని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మార్కెట్ డిమాండ్లకు ప్రతిస్పందించేందుకు సంస్థ మరింత సమర్థవంతంగా, చురుకుగా మారడం పైన దృష్టి పెట్టిందన్నారు. 

డెల్‌లో ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్యను మాత్రం  డెల్ ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించలేదు. అయితే పలు ఆన్‌లైన్ రిపోర్టులు ఈ సంఖ్య వేలల్లో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఒక లేఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ ప్రకారం దాదాపు 12,500 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని పేర్కొంది.  ఉద్యోగాలు కోల్పోయిన వారు ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందినవారని డెల్ ఎగ్జిక్యూటివ్‌లు బిల్ స్కానెల్, జాన్ బర్న్ తెలియజేశారు. 


AI సెంటర్ ఏర్పాటు..

డెల్ పునర్ నిర్మాణంలో భాగంగా AI-సెంటర్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇది AI-ఆప్టిమైజ్డ్ సర్వర్లు మరియు డేటా సెంటర్ పరిష్కారాలలో కంపెనీ యొక్క ఆఫరింగ్స్ ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
 

2023లో పోయిన ఉద్యోగాలు 2,60,000..

డెల్ కంపెనీ 2023 ప్రారంభంలోనే భారీ సంఖ్యలో 13,000 ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది మరోసారి భారీస్థాయిలో కోత విధిస్తోంది. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. 2023లో దాదాపు 2,000 టెక్ కంపెనీలు 260,000 పైగా ఉద్యోగులను తొలగించాయి. 2024లో మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగాల కోత దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించాయి.

Latest Videos

click me!