Tirumala News: సొంత వాహనంపై తిరుమల వెళుతున్నారా? ఇది మీ దగ్గర లేకపోతే అలిపిరి దగ్గరే ఆపేయగలరు జాగ్రత్త

Published : Aug 14, 2025, 11:12 AM ISTUpdated : Aug 14, 2025, 11:13 AM IST

తిరుపతికి సొంత వాహనాలపై వెళ్లేవారు కచ్చితంగా రేపటి నుంచి ఫాస్టాగ్ తీసుకోవాలి. లేకుంటే అలిపిరి చెక్ పోస్టు నుంచి మీరు లోపలికి వెళ్లలేరు. అలిపిరి చెక్ పోస్టు వద్దే ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. 

PREV
14
తిరుమలకు వెళుతున్నారా?

ఆంధ్రప్రదేశ్లోని తిరుమలకు ప్రతిరోజూ సొంత వాహనాలపై వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మన దేశంలోనే అనేక రాష్ట్రాల నుంచి ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పండుగలు, సెలవు దినాలు ఉన్నాయంటే భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే సొంత వాహనాలపై తిరుమలకు వెళ్లేవారు కచ్చితంగా ఫాస్టాగ్ ను తీసుకోవాలి. లేకుంటే అలిపిరి చెక్ పోస్టు నుంచి లోపలికి వెళ్లలేరు. అలిపిరి చెక్ పోస్టు తిరుమల కొండ దిగువనే ఉంటుంది. అక్కడే ఫాస్టాగ్ ను పొందవచ్చు. ఈ ఫాస్టాగ్ ఎలా పొందాలో తెలుసుకోండి.

24
అలిపిరి దగ్గరే ఆగిపోవాలి

అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరే తిరుమల కొండకు వెళ్లే రహదారి ప్రారంభమవుతుంది. అన్ని రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు అలిపిరి చెక్ పోస్ట్ ను దాటి తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుండి టీటీడీ తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పని చేసినట్టు ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 15 నుండి ఫాస్టాగ్ లేని వాహనాలు తిరుమలలోకి అనుమతించేది లేదని చెప్పింది.

34
ఫాస్టాగ్ తప్పనిసరి

అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అలాగే భక్తుల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి కూడా ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరైతే ఫాస్టాగ్ లేకుండా సొంత వాహనాలపై రేపటి నుంచి అలిపిరి చెక్ పోస్టు వద్దకు చేరుకుంటారో... అక్కడే దాన్ని పొందే సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలిపిరి చెక్ పోస్టు దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ సహకారంతో ఈ ఫాస్టాగ్ జారీ చేసే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో దరఖాస్తు పూర్తి చేసి అవసరమైన పత్రాలను సమర్పించాలి. అలాగే ఫాస్టాగ్ కోసం కొంత మొత్తాన్ని కూడా చెల్లించాలి.

44
ఏ పత్రాలు అవసరం పడతాయి?

మీరిచ్చిన అప్లికేషన్‌తో పాటు కొన్ని పత్రాలను వారికి ఇవ్వాల్సి వస్తుంది. మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు ఐడీ, పాన్ కార్డును కచ్చితంగా వారికి ఇవ్వాలి. ఇవన్నీ ముందుగానే జెరాక్స్ లు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఫాస్టాగ్ కార్డును అప్పటికప్పుడే జారీ చేస్తారు. దానిని మీ వాహనం విండ్ షీల్డ్ కు అతికించుకోవచ్చు. ఎప్పటికప్పుడు దాని రీఛార్జ్ చేసి ఉపయోగించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories