OTT: ఫోన్‌లో ఐపీఎల్‌ చూసే వారికి పండగే.. డేటాతో పాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా, రూ. 100కే

Published : Mar 10, 2025, 03:03 PM IST

టెలికం రంగంలో సంచలనంగా దూసుకొచ్చిన జియో రోజురోజుకీ వినియోగదారులను పెంచుకుంటూ పోతోంది. ఇక తాజాగా డిస్నీ+ హాట్‌ స్టార్‌తో చేతులు కలిపి జియోహాట్‌స్టార్‌ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లను పరిచయం చేస్తుంది..   

PREV
14
OTT: ఫోన్‌లో ఐపీఎల్‌ చూసే వారికి పండగే.. డేటాతో పాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా, రూ. 100కే

ఐపీఎల్‌ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా క్రికెట్‌ అభమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ పండగ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. మార్చి 22వ తేదీన కోల్‌తా నైట్‌ రైడర్స్, రాయల్‌ ఛాలంజర్స్‌ బెంగళూరుల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే మొన్నటి వరకు జియో టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూసిన విషయం తెలిసిందే. కానీ జియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనమై జియో హాట్‌స్టార్‌గా మారిన తర్వాత కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి వచ్చింది. 

24

ఈ నేపథ్యంలో ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు జియో తక్కువ ధరలోనే మంచి ప్లాన్స్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చారు. రూ. 100ని జియో ఆదివారం లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఇందులో మొబైల్‌తో పాటు టీవీ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అంతేకాదు 5జీబీ డేటా కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ బెనిఫిట్స్‌ ఉండవు. 

34

5జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. డేటా పూర్తయిన తర్వాత కూడా జియోహాట్‌ స్టార్‌ సేవలు90 రోజుల పాటు కొనసాగుతాయి. ఇంట్లో వైఫై లేదా ఏదైనా యాక్టివ్‌ డేటా ప్లాన్‌ ఉన్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వారు జియో యాప్‌ లేదా ఏదైనా యూపీఐ పేమెంట్‌ ఆప్షన్‌ ద్వారా చేసుకోవచ్చు. 
 

44

రూ. 195 ప్లాన్‌..

ఎక్కువ డేటా కావాలనుకునే వారి కోసం రూ. 195 ప్లాన్‌ను తీసుకొచ్చారు ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో 15 జీబీ డేటా లబిస్తుంది. ఇందులో కూడా ఎలాంటి కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ బెనిఫిట్స్‌ లభంచవు. 15 జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ స్పీడ 64 కేబీపీఎస్‌కి తగ్గుతుంది. అయితే ఇందులో జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం మొబైల్‌ వెర్షన్‌ మాత్రమే లభిస్తుంది. ఈ ఐపీఎల్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 
 

click me!

Recommended Stories