Recharge plan: అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజూ 2 జీబీ డేటా.. 425 రోజుల వ్యాలిడిటీ.. రీఛార్జ్ ప్లాన్ వివరాలు..

Published : Mar 10, 2025, 12:30 PM ISTUpdated : Mar 10, 2025, 06:55 PM IST

టెలకాం రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి కంపెనీలు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. హోలీ పండుగను పురస్కరించుకొని యూజర్ల కోసం బంపరాఫర్‌ను అందించింది. ఇంతకీ ఏంటా ఆఫర్‌.? ఎలాంటి బెనిఫిట్స్‌ పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Recharge plan: అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజూ 2 జీబీ డేటా.. 425 రోజుల వ్యాలిడిటీ.. రీఛార్జ్ ప్లాన్ వివరాలు..

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను ఆకర్షించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించేందుకు భారీ ఎత్తున కొత్త టవర్లను ఏర్పాటు చేస్తోంది. 5జీ నెట్‌ వర్క్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు నెట్‌వర్క్‌ విస్తరిస్తూనే మరోవైపు యూజర్లను ఆకట్టుకునేందుకు కొంగొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హోలీ పండుగను పురస్కరించుకొని ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 
 

24

ఇప్పటికే అందుబాటులో ఉన్న రీచార్జ్‌ ప్లాన్‌కు సంబంధించి వ్యాలిడిటీని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. అయితే ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

34

రూ. 1499 ప్లాన్‌: 

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోన్న బెస్ట్‌ ప్లాన్స్‌లో రూ. 1499 ప్లాన్‌ ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేస్తే యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఉచితంగా నేషనల్ రోమింగ్‌, రోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే 24 జీబీ వరకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ లభిస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ స్పీడ్‌ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇదిలా ఉంటే హోలీ సందర్భంగా ఈ ప్లాన్‌ వ్యాలిడిటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 336 రోజులు ఉన్న వ్యాలిడిటీని 365కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నెల రోజుల వ్యాలిడిటీ ఉచితంగా పొందొచ్చు. 
 

44

రూ. 2399 ప్లాన్‌: 

ఇదిలా ఉంటే మరో ప్లాన్‌కి కూడా వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయం తీసుకుంది. రూ. 2399 ప్లాన్‌ వ్యాలిడిటీ 395 రోజులు ఉండగా హోలీ ఆఫర్‌ కింద ఈ వ్యాలిడిటీని 425 రోజులకు పొడగించారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ హై స్పీడ్‌ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, అలాగే Delhi, Mumbai ప్రాంతాల్లో MTNL నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్ లాంటి ప్రయోజనాలు పొందొచ్చు. వీటికి అదనంగా BSNL వినియోగదారులకు BiTV ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, కొన్ని OTT యాప్‌ల యాక్సెస్ కూడా అందిస్తోంది. 
 

click me!

Recommended Stories