కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతూనే ఉంది. చాలామంది ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు విపరీతంగా పడిపోతున్నాయి. వాటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లు తక్కువగానే క్షీణించాయి. కానీ వీటి ఉద్దేశం దీర్ఘకాలంలో మంచి రాబడినివ్వడం. ప్రస్తుతం మార్కెట్ దిద్దుబాటుకి గురైన తరుణంలో కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి మొత్తం పెంచడం ఇది సానుకూల సమయం. అందుకే మంచి రాబడినిచ్చిన టాప్ 5 స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ల గురించి తెలుసుకుందాం.
భారతీయ స్టాక్ మార్కెట్ గత 5 నెలల్లో భారీ పతనాన్ని చవిచూసింది. మార్చి 6 నాటికి సూచీలు 14% వరకు పడిపోయాయి. స్మాల్-క్యాప్ ఫండ్లు నష్టపోయినా, 5 ఏళ్లలో బాగా రాణించాయి. గత 5 ఏళ్లలో మంచి రాబడినిచ్చిన టాప్ 5 మ్యూచువల్ ఫండ్లలో 3 స్మాల్-క్యాప్ ఫండ్లు ఉన్నాయి. కొన్ని నెలలుగా బలహీనంగా ఉన్నా, దీర్ఘకాలంలో ఇవి బాగా పనిచేశాయి.