Jio Frames: జియో ఫ్రేమ్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. అన్ని పనులు చేస్తుంది !

Published : Aug 29, 2025, 09:34 PM IST

Jio Frames: రిలయన్స్ 48వ ఏజీఎంలో జియో ఫ్రేమ్స్ స్మార్ట్ గ్లాసెస్ ను ప్రకటించింది. మల్టీ లాంగ్వేజ్ ఏఐ, ఫోటో, వీడియో, మ్యూజిక్, కాల్స్‌ కు సపోర్ట్ చేయడంతో పాటు ఇలాంటి అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

PREV
16
జియో ఫ్రేమ్స్ అధికారికంగా ప్రకటించిన రిలయన్స్

రిలయన్స్ జియో భారత డిజిటల్ ప్రయాణంలో మరో కొత్త అడుగు వేసింది. శుక్రవారం జరిగిన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో కంపెనీ జియో ఫ్రేమ్స్ అనే AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ఈ గ్లాసెస్ అనేక ఫీచర్లను కలిగి ఉంది.

జియో ఫ్రేమ్స్ స్మార్ట్ గ్లాసెస్ ను ఉపయోగించి వినియోగదారులు ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అలాగే, మ్యూజిక్ వినే సౌకర్యం, వాయిస్ AI ద్వారా సంభాషణ, లైవ్ స్ట్రీమింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

26
జియో ఫ్రేమ్స్ ముఖ్య ఫీచర్లు

జియో ఫ్రేమ్స్ జియో వాయిస్ AI సపోర్ట్‌తో వస్తుంది. ఇది పూర్తిగా హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని కల్పిస్తుంది. వినియోగదారులు వాయిస్ కమాండ్ ద్వారా కాల్స్ తీసుకోవచ్చు, మ్యూజిక్ వినవచ్చు, ఫోటోలు తీయవచ్చు, వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ గ్లాస్‌లోని ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్లు, స్పీకర్లు ద్వారా స్పష్టమైన ఆడియో అందుతుంది.

36
మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ తో జియో ఫ్రేమ్స్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్

ఈ స్మార్ట్ గ్లాసెస్ లోని జియో వాయిస్ AI మల్టీ లాంగ్వేజ్ సపోర్టును కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలి, గుజరాతీ వంటి భాషలతో పాటు మరికొన్ని భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. రియల్ టైమ్ వాయిస్ ట్రాన్స్‌లేషన్ కూడా ఇందులో భాగం. ఇది వినియోగదారులకు వివిధ భాషల్లో సులభంగా సంభాషించే అవకాశాన్ని ఇస్తుంది. దీనివల్ల భాషల మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వినియోగదారులు తమ సొంత భాషలో మాట్లాడినా, ఎదుటి వ్యక్తి భాషలో తక్షణమే అనువాదం అందుతుంది.

46
జియో స్మార్ట్ గ్లాసెస్ లో ఫోటోలు, వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్లు

జియో ఫ్రేమ్స్‌ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ లో ఫుల్ HD (1080p) వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. వినియోగదారులు ఫోటోలు తీయడం మాత్రమే కాకుండా లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయగలరు. ప్రతి ఫుటేజ్ ఆటోమేటిక్‌గా జియో క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ అవుతుంది. కంపెనీ స్పష్టంగా కెమెరా వివరాలు వెల్లడించనప్పటికీ, డ్యూయల్ ఫార్వర్డ్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుందని సమాచారం.

56
హెల్త్, ఎడ్యుకేషన్, డైలీ లైఫ్‌లో గేమ్ ఛేంజర్ జియో ఫ్రేమ్స్

జియో ఫ్రేమ్స్ కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు, హెల్త్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ సూచనలు, పుస్తకాలను సమ్మరీ చేయడం, లెర్నింగ్ సపోర్ట్, రిమైండర్లు ఇవ్వడం వంటి విభిన్న పనులు చేస్తుంది. విద్యార్థులు చదువులో సహాయం పొందవచ్చు. ప్రొఫెషనల్స్ మీటింగ్స్, నోటిఫికేషన్లను సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే రోజువారీ జీవితంలో వాడుకునే విధంగా డిజైన్ చేసినట్టు కంపెనీ తెలిపింది.

66
జియో ఫ్రేమ్స్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ధర ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం జియో ఫ్రేమ్స్ ధరను కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఉత్పత్తి పేజీ ఇప్పటికే లైవ్‌లో ఉంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర రూ.10,000 నుండి రూ.15,000 మధ్య ఉండే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న రే-బాన్ మెటా గ్లాసెస్, ఓక్లీ మెటా AI గ్లాసెస్ వంటి ప్రీమియం ఉత్పత్తులకు పోటీగా నిలుస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

జియో ఫ్రేమ్స్: ఒకే గ్లాస్.. ఫీచర్లు ఎన్నో

జియో ఫ్రేమ్స్ డిజైన్ తేలికగా, స్టైలిష్‌గా ఉంటుంది. రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు కాల్స్, ఫోటోలు, మ్యూజిక్, లైవ్ స్ట్రీమింగ్, ట్రాన్స్ లేషన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను ఒకే పరికరంలో ఉండటం కొత్త అనుభవాన్ని పంచుతుంది. జియో వాయిస్ AIతో ఇది ప్రతి భారతీయుని భాష, సంస్కృతి, జీవనశైలికి సరిపోయేలా రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories