Jio Bharat బంపర్ ఆఫర్: రూ.699కే కొత్త ఫోన్, 14 ఓటీటీలు కూడా..

First Published | Oct 26, 2024, 4:55 PM IST

రిలయన్స్ జియో నుంచి ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. దీపావళి సందర్భంగా తన వినియోగదారులకు కానుకగా ఇప్పటికే ప్రత్యేక డిస్కౌంట్లతో రీఛార్జ్ ప్లాన్లు ప్రకటించింది. ఇప్పుడు ఇతర నెట్వర్క్ ల వినియోగదారులను ఆకట్టుకోవడానికి భారీ తగ్గింపులో జియో ఫోన్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జియో ఫోన్లు కొన్న వారికి ఊహించని విధంగా వేల రూపాయలు విలువజేసే సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్ ఆఫర్లు గతంలో మీరెన్నడూ చూసుండరు. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 

Jio Bharat దీపావళి ధమాకా ఆఫర్ తో ముందుకొచ్చింది. భారతదేశం అంతటా 2G వినియోగదారుల జీవితాల్లో Jio వెలుగులు నింపుతోంది. 4G నెట్వర్క్ యాక్సిస్ చేయగల జియో భారత్ కీప్యాడ్ ఫోన్ భారీ తగ్గింపుతో మార్కెట్ లో విడుదలైంది. రూ.999 ధర కలిగిన ఈ కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు రూ.699 కే విక్రయిస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఫోన్ కొన్న వారికి మరిన్ని ఆఫర్లు ప్రకటించింది.  ప్రతి ఒక్కరూ డిజిటల్ సేవలు పొందాలని, తమ ప్రియమైన వారితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండేందుకు ఈ ప్రత్యేక దీపావళి ఆఫర్ ఇస్తున్నట్లు జియో ప్రతినిధులు తెలిపారు. 
 

జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్ 2016లో మార్కెట్ లోకి విడుదలైంది. ఈ ఫోన్ కొన్ని నెలల క్రితం ఇండియాలో 50 % మార్కెట్ షేర్‌ను సాధించింది. అప్పట్లో ఈ విషయం చెప్పి షేర్‌హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అభినందనలు తెలుపుతూ లేఖ కూడా రాశారు.  ఫీచర్ ఫోన్ ధరకు స్మార్ట్‌ఫోన్ అందించి జియో భారత్ దేశం ముందడుగు వేసేలా చేసిందన్నారు. 
 


భారత్‌లో సుమారు 25 కోట్ల మంది జియో భారత్ కీప్యాడ్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా జియో ఫోన్ ద్వారా డిజిటల్ సేవలు పొందొచ్చు. జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్లోనే యూపీఐ, జియో సినిమా, జియో టీవీ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. అతి తక్కువ ధర కలిగిన  ఈ పరికరం వినియోగదారులను స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే డిజిటల్ సేవలు అందిస్తోంది.

రూ.999 జియో భారత్ కీప్యాడ్ ఫోన్ దీపావళి సందర్బంగా కేవలం రూ.699కు లభిస్తోంది. అంతేకాకుండా రూ.123 నెలవారీ టారిఫ్ ప్లాన్ వేసుకోవడం ద్వారా 455+ టీవీ ఛానెల్‌లు పొందొచ్చు. వీటితో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు ఉచితంగా చేసుకోవచ్చు. కీప్యాడ్ ఫోన్ లో డిజిటల్ సేవలు పొందే అవకాశం ఉండటంతో జియో కంపెనీ 14 GB డేటా కూడా ఇస్తోంది. ఇది నెలవారీ ప్లాన్. 
 

కేవలం రూ. 123 నెలవారీ ప్లాన్‌తో Jio Bharat వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ చేయొచ్చు. లకు 14 జీబీ డేటాతో పాటు 455 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు మీరు లైవ్ చూడొచ్చు. ఇవే కాకుండా సినిమా ప్రీమియర్లు, తాజా సినిమాలు కూడా మీరు జియో భారత్ ఫోన్ ఉపయోగించి చూడొచ్చు. వీడియో షోలు, లైవ్ స్పోర్ట్స్, జియో సినిమాలోని ముఖ్యాంశాలు, సమాచారం కూడా మీరు ఈ కీప్యాడ్ ఫోన్ లోనే పొందొచ్చు. 

వీటితో పాటుగా QR కోడ్ స్కాన్‌ చేయడం కూడా ఈ ఫోన్ తో చేయొచ్చు. డిజిటల్ చెల్లింపులు సింపుల్ గా చేయొచ్చు. Jio Pay ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్‌లను ఎంజాయ్ చేయడానికి ఈ పోర్టబుల్ ఫోన్ సహకరిస్తుంది. JioChatలో వీడియోలు, ఫోటోలు, మెస్సేజ్ లు షేర్ చేసుకోవచ్చు. 

ఇతర నెట్వర్క్ లలో అందుబాటులో ఉన్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌లతో (నెలకు రూ. 199) పోల్చినప్పుడు Jio Bharat ప్లాన్ దాదాపు 40% చౌకగా లభిస్తోంది. అంటే మీరు ప్రతి నెలా రూ. 76 ఆదా చేసుకోవచ్చన్న మాట. ప్లాన్ సేవింగ్స్ ద్వారా మీరు 9 నెలల్లో ఫోన్ కొన్న ధరను తిరిగి పొందుతారు. ఈ ఫోన్ ను మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ ఆదా అవుతుంది. చూడటానికి కీప్యాడ్ ఫోన్ అయినా ఇది ఫోన్ కంటే ఎక్కువ. ఈ ఫోన్ ను మీ సమీప స్టోర్, Jio Mart లేదా Amazon నుంచి కొనుగోలు చేయొచ్చు. 
 

Latest Videos

click me!