జియో దూసుకుపోతోంది.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు 5G స్మార్ట్‌ఫోన్ రెడీ

First Published | Nov 6, 2024, 10:10 AM IST

రిలయన్స్ జియో నుంచి మరో అద్భుతమైన ఫోన్ రానుంది. 4G నుంచి 5G టెక్నాలజీలోకి అడుగుపెట్టిన ఇండియాను సాంకేతికంగా పరుగులు పెట్టించేందుకు జియో వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే 5G సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌ను జియో తయారు చేస్తోంది. ఆ ఫోన్ ఫీచర్లు, ధర తదితర విషయాలు తెలుసుకుందాం రండి. 

ముఖేష్ అంబానీ తన రిలయన్స్ జియో నుంచి మరో అద్భుతమైన ఫోన్ ను ప్రజలకు అందించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే 5G టెక్నాలజీని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సిగ్నల్స్ అందిస్తూ టెలికాం సేవలు అందిస్తున్నారు. దేశంలోనే తక్కువ ధరకు టారిఫ్ ధరలు, ఫోన్లు అందిస్తున్న టెలికాం సంస్థ ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియో అనే చెప్పాలి. పోటీ కంపెనీలు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చినప్పుడల్లా ఫోన్ల ధరలు పెంచి విక్రయిస్తుంటే జియో మాత్రం అదే టెక్నాలజీతో తయారు చేసిన ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలను ఆశ్యర్య పరుస్తుంటారు. 

రిలయన్స్ జియో నుంచి ఇప్పటికే రూ.999 కే కీప్యాడ్ ఫోన్ అందిస్తున్నారు. కీప్యాడ్ ఫోన్ అయినప్పటికీ 4జీ టెక్నాలజీతో తయారుచేసి మెరుగైన, నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. ఇదే ఫోన్ ను ఇటీవల పండగల సీజన్ లో కేవలం రూ.699 కే విక్రయించి పేద ప్రజలకు డిజిటల్ సేవలు మరింత చేరువ చేశారు. 
 

ఇప్పుడు ముఖేష్ అంబానీ జియో మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ జియో భారత్ 5Gని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను తక్కువ ధరకే మార్కెట్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అద్భుతమైన ఫీచర్లతో 5G సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇదే ఫీచర్స్ తో ఉన్న పోటీ కంపెనీల ఫోన్లు మార్కెట్లో వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తే వారికి బిజినెస్ కు ఇబ్బందే మరి.


డిస్‌ప్లే, ప్రాసెసింగ్ పవర్

జియో భారత్ 5G 5.3 అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లేతో రానుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌, 720×1920 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో స్పష్టమైన, ప్రకాశవంతమైన దృశ్యాలను అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణ. MediaTek Dimensity 6200 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది.

బ్యాటరీ

జియో భారత్ 5G 7100mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 50 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 108 MP ప్రధాన కెమెరా, 12 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5 MP పోర్ట్రెయిట్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. HD వీడియో రికార్డింగ్, 10X జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

స్టోరేజ్ వేరియంట్లు
1.6GB RAM + 64GB స్టోరేజ్
2.6GB RAM + 128GB స్టోరేజ్
3.8GB RAM + 128GB స్టోరేజ్ రకాలుగా జియో భారత్ 5G మార్కెట్ లోకి రానుంది.

వీటి ధరలు రూ.4,999 నుండి రూ.5,999 ధరలతో విడుదల అవుతాయని నిపుణుల అంచనా. రూ.1,000 నుండి రూ.2,000 వరకు ఇతర తగ్గింపులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కేవలం రూ.999 నుండి EMIలలో కూడా లభ్యం కావచ్చని తెలుస్తోంది.

విడుదల తేదీ
2025 జనవరి, ఫిబ్రవరి మధ్యలో విడుదల కావచ్చు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ సమాచారం ప్రాథమిక నివేదికల ఆధారంగా సేకరించింది. 

Latest Videos

click me!