రూ.450కే గ్యాస్ సిలిండర్! ఎప్పుడిస్తారో తెలుసా?

First Published | Nov 5, 2024, 8:13 PM IST

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇంత తక్కువ ధరకు గ్యాస్ సిలెండర్ పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీకు అర్హత ఉందో లేదో ఓ సారి చెక్ చేసుకోండి. 

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు మద్దతుగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పేద కుటుంబాలకు రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తారు.

ప్రధాని చొరవతో ఈ పథకం పరిధిని విస్తరించారు. ఇప్పటి వరకు పేదలకు మాత్రమే ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేవారు. వీటిని పిఓఎస్ మెషిన్‌ ద్వారా ట్రన్స్ పరెన్సీగా పంపిణీ చేసేవారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) పరిధిలోకి వచ్చే కుటుంబాలకు కూడా వీటిని అందించేందుకు నిర్ణయించారు. అయితే NFSA కిందకు వచ్చే వారు LPG IDని పొందడం ద్వారా రూ.450కి గ్యాస్ సిలెండర్ పొందొచ్చు. రేషన్ షాపులోని పిఓఎస్ మెషిన్ ద్వారా మీరు మీ వివరాలు నమోదు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

ఇప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి సబ్సిడీపై రేషన్ సరకులు పంపిణీ చేసేవారు. ఇప్పుడు రేషన్ కార్డుపై పూర్తి గోధుమలు పొందే కుటుంబాలకు అంటే జాతీయ ఆహార భద్రతా పథకం లబ్ధిదారుల కుటుంబాలు కూడా పండగల సీజన్ లో తక్కువకు గ్యాస్ సిలెండర్ పొందవచ్చన్న మాట. దీని కోసం వారు ప్రత్యేకంగా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. దీని కోసం రేషన్ షాపు ద్వారా తమ LPG IDని లింక్ చేసుకోవాలి.

LPG సిలిండర్ సబ్సిడీ పథకం కింద జాతీయ ఆహార భద్రతా పథకం అర్హత కలిగిన కుటుంబాల LPG IDలను ఆధార్, రేషన్ కార్డులతో అందిస్తారు. ఇది నవంబర్ 5 నుండి నవంబర్ 30, 2024 వరకు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రేషన్ షాపులలో ఉన్న పిఓఎస్ మెషిన్ల ద్వారా అర్హులు వీటిని పొందవచ్చని తెలిపారు.

Latest Videos


దీని ద్వారా స్థానికంగా ఈ పథకం కింద రూ.450కే గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఆధార్ కార్డులు లింక్ చేయని జాతీయ ఆహార భద్రతా కుటుంబాలు లేదా వారి సభ్యులకు ఉపశమనం కలిగించేందుకు నిర్ణీత కాలంలో రేషన్ షాపు స్థాయి నుండే పిఓఎస్ మెషిన్ల ద్వారా ఆధార్ నెంబర్ లింక్ చేసుకునే ఏర్పాటు చేశారు.

కాబట్టి ఆధార్ కార్డులు లింక్ చేయని లబ్ధిదారులందరూ తమ ఆధార్ కార్డు వెంటనే లింక్ చేసుకోవాలి.

ఈ కాలంలో సుప్రీంకోర్టు తీర్పు, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ షాపు డీలర్ ద్వారా పిఓఎస్ మెషిన్ నుండి మిగిలిపోయిన లబ్ధిదారుల e-KYC కూడా చేేసుకోవాలి. అన్ని రేషన్ షాపు డీలర్లు, జాతీయ ఆహార భద్రతా పథకం అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డు, LPG ID, e-KYC లింక్ చేసిన తర్వాతే లబ్ధిదారులకు ఇవి పంపిణీ చేస్తారు.

click me!