ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్

Published : Aug 19, 2025, 10:35 PM IST

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. జియో బాటలోనే ముందుకు సాగుతూ 1జీబీ డేటా బేసిక్ ప్లాన్ ను రద్దు చేసింది. దీంతో ఇకపై వినియోగదారులు ఎక్కువ ధరల ప్లాన్లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

PREV
15
ఎంట్రీ లెవల్ ప్లాన్ కు గుడ్ బై చెప్పిన ఎయిర్ టెల్

భారత టెలికాం రంగంలో మరోసారి పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఇప్పటికే జియో 1GB రోజువారీ డేటా అందించే రూ.249 ప్లాన్‌ను నిలిపివేయగా, ఎయిర్‌టెల్ కూడా అదే దారిలో నడిచింది. ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. దీంతో కనీస రీఛార్జ్‌ చేయాలనుకునే కస్టమర్లు ఇకపై మరింత ఖరీదైన ప్యాకేజీలను ఎంచుకోవాల్సిందే.

25
ఎయిర్ టెల్ ప్రస్తుత బేసిక్ ప్లాన్ వివరాలు

ప్రస్తుతం ఎయిర్‌టెల్ రూ.249కి 24 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1GB డేటా అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ రద్దు కావడంతో వినియోగదారులు కనీసం రూ.319 ప్లాన్‌ను తీసుకోవాల్సి వస్తుంది. ఈ కొత్త ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా ఇస్తుంది. 

జియో కూడా ఇదే విధంగా 1GB ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఇప్పుడు జియోలో 28 రోజులకు రూ.299 (1.5GB/Day), రూ.349 (2GB/Day) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

35
వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా రూ.299కి రోజుకు 1GB డేటా ప్లాన్ అందిస్తోంది. అయితే జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే మార్పులు చేసిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పుల ఊబిలో ఉన్న ఈ కంపెనీకి ఆదాయాలు పెరగడం అత్యవసరమైంది. కాబట్టి మార్పులు తప్పకుండా ఉంటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

45
ఎంట్రీ లెవల్ ప్లాన్ల మార్పులు ఎందుకు తీసుకుంటున్నారు?

టెలికాం విశ్లేషకుల ప్రకారం, ఎంట్రీ లెవల్ ప్లాన్లను తొలగించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ARPU (Average Revenue Per User) పెంచుకోవడమే. ప్రస్తుతం జియో వినియోగదారుల్లో 20-25 శాతం, ఎయిర్‌టెల్ వినియోగదారుల్లో 18-20 శాతం మంది 1GB ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను వాడుతున్నారు. వీరంతా కొత్తగా 1.5GB లేదా 2GB డేటా ప్లాన్లను ఎంచుకోవాల్సి రావడం వల్ల ఆయా కంపెనీల ఆదాయాలు 4 శాతం పైగా పెరుగుతాయని అంచనా.

55
వినియోగదారులపై మరింత భారం

తక్కువ డేటా వినియోగించే వినియోగదారులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది. ఇప్పటివరకు తక్కువ ఖర్చుతో రీఛార్జ్‌ చేసే వారికి కనీసం రూ.50-70 వరకు అదనంగా ఖర్చవుతుంది.

అయితే కంపెనీల అభిప్రాయం ప్రకారం, 5G లాంచ్ తర్వాత వినియోగదారుల డేటా వాడకం పెరిగింది. అందువల్ల తక్కువ డేటా ప్లాన్లకు డిమాండ్ తగ్గిపోయింది. టెలికాం సంస్థల లాభదాయకత కోసం ఈ మార్పులు తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories