రెండు, మూడు క్రెడిట్ కార్డులు వాడితే ఏమవుతుందో తెలుసా?

Published : Aug 19, 2025, 08:10 PM IST

ఈ మధ్య క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి లేదా అంతకంటే ఎక్కువే క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అసలు క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉండటం లాభమా, నష్టమా? వాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
క్రెడిట్ కార్డుల వాడకం..

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు వాడుతున్నారు. గతంలో ఏదైనా అత్యవసరం అయితేనే క్రెడిట్ కార్డు వాడేవారు. కానీ ఇప్పుడు అన్నీ పనులకు వాడుతున్నారు. కిరణా సరుకుల నుంచి పెట్రోల్ వరకు అన్నీ క్రెడిట్ కార్డుపైనే కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంతమంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. అలా రెండు, మూడు క్రెడిట్ కార్డులు వాడటం వల్ల కలిగే లాభ, నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

24
ఎక్కువ క్రెడిట్ కార్డుల వాడకం వల్ల లాభాలు

వేర్వేరు బ్యాంకుల నుంచి రెండు, మూడు క్రెడిట్ కార్డులు తీసుకోవడం ద్వారా మొత్తం క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. ఇది ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు సరైన టైంలో సరైన విధంగా బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరగవుతుంది. పైగా ప్రతి క్రెడిట్ కార్డుకు ప్రత్యేకమైన రివార్డ్స్ ఉంటాయి. తద్వారా మంచి ఆఫర్లు కూడా పొందవచ్చు. ఎమెర్జెన్సీ టైంలో మల్టిపుల్ క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. ఒక కార్డు ఫెయిల్ అయినా, మరొకదాంతో లావాదేవీ కొనసాగించవచ్చు.

34
ఎక్కువ క్రెడిట్ కార్డుల వాడకం వల్ల నష్టాలు

సాధారణంగా వేర్వేరు క్రెడిట్ కార్డులకు వేర్వేరు బిల్లింగ్ డేట్స్ ఉంటాయి. దానివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సమయానికి బిల్లులు చెల్లించకపోతే లేటు ఫీజులు కట్టాల్సి వస్తుంది. బ్యాలెన్స్ క్లీర్ చేయలేకపోతే ఒక్కో కార్డుకు 30 శాతానికి పైగా వడ్డీ పడవచ్చు. అంతేకాదు అన్ని కార్డుల్లో లిమిట్ ఉండటం వల్ల ఎక్కువ ఖర్చు చేసే  అవకాశం ఉంటుంది. టైంకి బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.  

44
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • అన్ని క్రెడిట్ కార్డుల బిల్లింగ్ తేదీలు తెలుసుకొని సమయానికి చెల్లించాలి.
  • అవసరం ఉన్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు వాడాలి. 
  • ప్రతీ నెల బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించాలి. కనీస చెల్లింపుతో ఆపకూడదు.
  • గొప్పల కోసం ఎక్కువ కార్డులు తీసుకోకూడదు.
  • మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం లోపే వాడేలా చూసుకోవాలి.

ఫైనల్ గా..

రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడటం మంచిదే. కానీ జాగ్రత్తగా వాడాలి. అవి మనకు ఆర్థికంగా మద్దతుగా ఉండాలే తప్ప భారం కాకూడదు. సరైన ప్లానింగ్ ఉంటే క్రెడిట్ కార్డులు మనకు మేలు చేస్తాయి. లేకపోతే అప్పులపాలు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories