జియో 8వ వార్షికోత్సవ ఆఫర్ : ఫ్రీగా 10 ఓటిటి ఫ్లాట్ ఫామ్స్, 10GB డాటా, రూ.500 షాపింగ్ కూపన్, జొమాటో గోల్డ్

First Published | Sep 5, 2024, 7:24 PM IST

భారతీయ కుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు. అవేంటో చూద్దాం...  

Reliance Jio 8th Anniversary

Reliance Jio 8th Anniversary : రిలయన్స్ జియో... భారత టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన పేరు. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్నవేళ రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో పేరుతో సరికొత్త ప్రయత్నం చేసింది. సిమ్ ఫ్రీ... అపరిమిత వాయిస్ కాల్స్, మెసేజ్ లే కాదు డాటా కూడా ఉచితమే. ఇలా జియో ఎంట్రీతో భారత టెలికాం రంగం పూర్తిగా మారిపోయింది. జియో పోటీని తట్టుకుని నిలిచేందుకు మిగతా ప్రైవేట్ టెలికాం కంపనీలు కూడా రీచార్జ్, డాటా ప్యాకేజీ ధరలను భారీగా తగ్గించారు. దీంతో భారతీయులకు అత్యంత చౌకగా టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

అతి తక్కువ కాలంలోనే భారతీయులకు దగ్గరైన జియో ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ లోనే జియో టెలికాం మార్కెట్ లోకి అడుగుపెట్టింది... అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఎనిమిదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించింది.  ప్రస్తుత భారత టెలికాం మార్కెట్ లో ఒక్క జియోదే 60 శాతం వాటా... దీన్ని ప్రజలకు ఎంత దగ్గరయ్యిందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు అందిస్తోంది. ఫ్రీ ఓటిటి సబ్ స్క్రిప్షన్, 10GB డాటాతో పాటు జొమాటో గోల్డ్ మెంబర్ షిప్, Ajio డిస్కౌంట్ కూపన్లు అందిస్తోంది. ఈ వార్షికోత్సవ ఆఫర్లను పొందేందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది. 
 

Reliance Jio 8th Anniversary

జియో వార్షికోత్సవ ఆఫర్లు ఎలా పొందాలి?  

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం ఎప్పుడూ సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ ను అందిస్తుంది. ఇటీవల భారీగా రీచార్జ్ ధరలు పెంచినా వినియోగదారులను ఆకట్టుకునేలా ప్లాన్స్ రూపొందించారు. రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా పలు సేవలను పొందేలా జియో ప్లాన్స్ వుంటున్నాయి. 

తాజాగా 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్లాన్స్ రీచార్జ్ పై ఆసక్తికర ఆఫర్లను ప్రకటించింది జియో. ఇలా జియో వినియోగదారులు రూ.899,రూ.999 లేదంటే రూ.3,599 ప్లాన్స్ లో దేన్ని పొందినా అపరిమిత వాయిస్ కాలింగ్, మెసేజ్, డాటానే కాదు మరికొన్ని సేవలను కూడా ఉచితంగా పొందవచ్చు. 
 
పైన పేర్కొన్న మూడు ప్లాన్స్ లో దేంతో రీచార్జ్ చేసుకున్నా రూ.175 విలువైన వౌచర్ లభిస్తుంది. అలాగే 10 ఓటిటి ప్లాట్ ఫార్మ్స్  ను ఉచితంగా పొందుతారు. ఇంకా 28 రోజుల వ్యాలిడిటీతో 10GB డేటాను అదనంగా పొందవచ్చు. 

అంతేకాకుండా రూ.500 విలువచేసే AJio కూపన్ కూడా లభిస్తుంది. AJio లో రూ.2999 షాపింగ్ చేస్తే ఈ కూపన్ ను ఉపయోగించి రూ.500 తగ్గించుకోవచ్చు. ఇక మూడు నెలల వ్యాలిడిటీతో జొమాటొ గోల్డ్ మెంబర్ షిప్ కూడా పొందుతారు. 
 


Reliance Jio 8th Anniversary

రీచార్జ్ ప్లాన్స్ వివరాలు : 

రూ.899 ప్లాన్ :

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు (మూడు నెలలు). ప్రతిరోజు అపరిమిత వాయిస్ కాల్స్ , 100 మెసేజ్ లు లభిస్తాయి. అంతేకాదు ప్రతిరోజు 2GB డాటా లభిస్తుంది. అదనంగా మరో 20GB డాటాను కూడా ఉపయోగించుకోవచ్చు. 

రూ.999 రీచార్జ్ : 

98 రోజులు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులో వుంది. మిగతా అన్ని బెనిఫిట్స్ రూ.899 మాదిరిగానే వుంటాయి. 

రూ.3,599 ప్లాన్ :  

ఈ ప్లాన్ 365 రోజులు అంటే ఏడాది వ్యాలిడిటీతో లభిస్తుంది. ఎలాంటి ఆటంకం లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 మెసేజ్ లు లభిస్తాయి. అలాగే ఏడాదిపాటు ప్రతిరోజు 2GB డాటా లభిస్తుంది. 
 

Reliance Jio 8th Anniversary

వార్షికోత్సవ ఆఫర్లు పరిమిత కాలానికే : 

పైన పేర్కొన్న మూడు ప్లాన్స్ లో దేన్నయినా రీచార్జ్ చేసుకుంటే జియో 8వ వార్షికోత్సవ ఆఫర్లు పొందవచ్చు. ఇందుకోసం jio.com లేదా మై జియో యాప్ ను ఉపయోగించండి. ఇక ఉచిత ఓటిటి సేవలను జియోటివి+ యాప్ లో పొందవచ్చు. 

జియో 8వ వార్షికోత్సవ ఆఫర్లు పరిమిత కాలానికే అందుబాటులో వుంటాయి. ఇవాళ్టి నుండే అంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఆ కాలవ్యవధిలో రూ.899, రూ.999, రూ.3,599 తో రీచార్జ్ చేసుకుంటేనే వార్షికోత్సవ ఆఫర్లు లభిస్తాయి. 

ఇలా రిలయన్స్ వినియోగదారులు ఈ ఐదురోజుల్లో రీచార్జ్ చేసుకుంటే మంచి ఆఫర్లు పొందవచ్చు. కాబట్టి వార్షికోత్సవ ఆఫర్లు పొందాలనుకునే జియో కస్టమర్లు ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 10 లోపు రీచార్జ్ చేసుకొండి. 

Latest Videos

click me!