LIC Jeevan Umang Policy: జస్ట్ రోజుకు రూ.45 పొదుపు చేస్తే చాలు, రూ.36 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?

First Published Jul 4, 2022, 2:37 PM IST

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కస్టమర్ల కోసం అనేక రకాల ప్లాన్‌లను అందిస్తోంది. ఎన్ని ప్రైవేటు కంపెనీలు వచ్చినప్పటికీ, నేటికీ ఎల్ఐసీ పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం ఇప్పటికీ స్థిరంగా ఉంది. పోస్టాఫీసు తరహాలోనే ఎల్ఐసీ అనేది తరతరాల విశ్వాసంగా మిగిలిపోయింది.  

మంచి రాబడితో పాటు, సురక్షితమైన పెట్టుబడి కారణంగా, దేశంలోని లక్షలాది మంది ప్రజలు తమ కష్టార్జితాన్ని  ఎల్‌ఐసి పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.  మీరు కూడా ఎల్‌ఐసీకి చెందిన ఏదైనా స్కీమ్‌లో దీర్ఘ కాలం పెట్టుబడి పెట్టి మంచి రాబడి రావాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మీరు జీవన్ ఉమంగ్  పాలసీని (LIC Jeevan Umang Plan) ఎంచుకోవచ్చు. జీవన్ ఉమంగ్ పాలసీ ఒక ఎండోమెంట్ ప్లాన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.
 

పాలసీకి ఎవరు అర్హులు..

LIC జీవన్ ఉమంగ్ పాలసీని తీసుకునే వారికి 100 సంవత్సరాల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. 90 రోజుల నుండి 55 సంవత్సరాల వయస్సు గల వారు ఈ ప్లాన్‌ లో చేరవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారు ఖాతాలో ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తంలో డబ్బు వస్తూనే ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే, అతని నామినీకి మొత్తం ఒకేసారి చెల్లించబడుతుంది.

పన్ను మినహాయింపు

మీరు జీవన్ ఉమంగ్ పాలసీలో 15, 20, 25, 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే లేదా అంగవైకల్యానికి గురైతే, UMANG పాలసీ ప్రకారం అతనికి టర్మ్ రైడర్ కూడా అందించబడుతుంది. అలాగే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

జీవన్ ఉమంగ్ పాలసీలో పెట్టుబడి పెట్టే వారికి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకోవాలంటే కనీసం రెండు లక్షల రూపాయల బీమా తీసుకోవాలి.

మీకు రూ.36 లక్షల రిటర్న్ వస్తుంది
ఒక వ్యక్తి 26 ఏళ్ల వయస్సులో జీవన్ ఉమంగ్ పాలసీని కొనుగోలు చేసి, రూ. 4.5 లక్షల బీమా రక్షణ కోసం 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి, అంటే మీరు నెలకు రూ.1350 చెల్లించాలి. ఈ విధంగా, మీరు ఈ పథకం పెట్టుబడి కోసం ప్రతిరోజూ 45 రూపాయలు ఆదా చేయాలి.

మీ ప్రీమియం ఒక సంవత్సరంలో రూ. 15882 మరియు 30 సంవత్సరాలలో మీ ప్రీమియం చెల్లింపు రూ. 4,76,460 అవుతుంది. ఈ విధంగా, LIC 31వ సంవత్సరం నుండి మీ పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 36 వేల రూపాయలను డిపాజిట్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా 31వ సంవత్సరం నుంచి 100 ఏళ్ల వరకు ప్రతి సంవత్సరం రూ.36,000 రిటర్న్ లభిస్తుంది.
 

పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం LIC జీవన్ ఉమంగ్ ప్లాన్ కింద లోన్ సౌకర్యం పొందవచ్చు. 2 సంవత్సరాలు పూర్తి ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే పాలసీదారు రుణం పొందేందుకు అర్హుడు. ఒకవేళ ప్రీమియం చెల్లింపు వ్యవధిలో రుణం పొందినట్లయితే, సరెండర్ విలువ శాతం రూపంలో అమలులో ఉన్న పాలసీలకు గరిష్ట రుణం 90 శాతం వరకూ పొందవచ్చు. వడ్డీతో పాటు చెల్లించని ఏదైనా రుణం ఉంటే పాలసీ క్లెయిమ్ లాభాల నుండి రుణానికి చెల్లించాల్సిన డబ్బులు మినహాయింపు చేసుకుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

click me!