ITR Filing Deadline 2026: ఐటీఆర్ ఫైలింగ్ డేట్.. ఇన్కమ్ టాక్స్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడం ఎలా? ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే!

Published : Jul 24, 2026, 02:47 PM IST

ITR filing deadline 2026: అస్సెస్మెంట్ ఇయర్ 2026-27 ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్ జూలై 31తో ముగుస్తుంది. ఆలస్యమైతే పడే 5 రకాల జరిమానాలు పడతాయి. ఏఐఎస్ పొరపాట్లు, ఇన్కమ్ టాక్స్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది: జూలై 31 దాటితే ఈ 5 ఫైన్లు తప్పవు

అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఇంకా మీరు మీ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి, ఈ-వెరిఫై చేయలేదా? అయితే వెంటనే అలర్ట్ అవ్వాల్సిన టైమ్ వచ్చింది. గడువు దాటితే ఊరికే టాక్స్ కట్టడం మాత్రమే కాదు, రకరకాల పెనాల్టీలు, ఐటీ నోటీసులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. అందుకే లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా వెంటనే మీ ఐటీఆర్‌ను ఫైల్ చేయడం చాలా మంచిది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా నిర్లక్ష్యం వల్ల ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మనపై ఏయే పెనాల్టీలు విధిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

26
ఐటీఆర్ లేట్ ఫైలింగ్, ముఖ్యమైన 5 పెనాల్టీలు

ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం వేర్వేరు తప్పులకు వేర్వేరు రకాల జరిమానాలు ఉంటాయి. అందులో ప్రధానంగా 5 రకాల పెనాల్టీలను ప్రతీ టాక్స్ పేయర్ తెలుసుకోవాల్సినవి..

• జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే (సెక్షన్ 234F): లేట్ ఫీజు గరిష్ఠంగా ₹5,000 వరకు పడుతుంది. మీ ఆదాయం ₹5 లక్షల లోపు ఉంటే మాత్రం ఈ ఫైన్ ₹1,000 ఉంటుంది.

• రివైజ్డ్ రిటర్న్ లేట్ అయితే (సెక్షన్ 234-I): ఆదాయాన్ని బట్టి ₹1,000 నుండి ₹5,000 వరకు చార్జ్ పడుతుంది.

• ఆదాయాన్ని తక్కువగా చూపించినా లేదా తప్పుగా పేర్కొన్నా (సెక్షన్ 270A): చెల్లించాల్సిన అసలు పన్నుపై 50% నుండి 200% వరకు భారీ పెనాల్టీ ఉంటుంది.

• రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే (సెక్షన్స్ 269ST & 271DA): మీరు రూల్స్ అతిక్రమించి తీసుకున్న క్యాష్ అమౌంట్‌తో సమానమైన (100%) పెనాల్టీ పడుతుంది.

• సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ చెల్లించకపోతే (సెక్షన్స్ 140A & 221): బాకీ ఉన్న మొత్తం టాక్స్ అమౌంట్ వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది.

36
స్పీడ్‌గా సాగుతున్న ఐటీఆర్ ప్రాసెసింగ్.. ఐటీ శాఖ ఏం చెప్పంది?

ఈ ఏడాది ఇన్కమ్ టాక్స్ పోర్టల్ చాలా వేగంగా పనిచేస్తోంది. జూలై 22 నాటికి దేశవ్యాప్తంగా 3.34 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. అందులో దాదాపు 1.99 కోట్ల రిటర్న్స్‌ను ఐటీ శాఖ అప్పుడే ప్రాసెస్ చేసేసింది. అంతేకాకుండా, ఇప్పటివరకు 3.15 కోట్ల రిటర్న్లు ఈ-వెరిఫై కూడా అయ్యాయి. ఈ-వేరిఫై అయిన వాటిలో మూడింట రెండు వంతుల ప్రాసెసింగ్ పూర్తయిపోయింది. దీనివల్ల టాక్స్ రీఫండ్స్ కూడా చాలా త్వరగా యూజర్ల బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి.

ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లో 14.03 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి టాక్స్ పేయర్ల సంఖ్య చాలా పెరిగింది. డిపార్ట్మెంట్ పంపిన నడ్జ్ మెసేజ్లు బాగా పనిచేయడంతో కొత్తవారు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

46
లాస్ట్ మినిట్ వరకు ఆగడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

చాలామంది జూలై చివరి వారంలో లేదా లాస్ట్ రోజైన జూలై 31న చేద్దాం అని చూస్తారు. అలా చేయడం వల్ల పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు రావచ్చు. చివరి నిమిషంలో హడావుడి పడటం వల్ల మీ Form 26AS లేదా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ లో ఉన్న డేటాని, మీ దగ్గరున్న డేటాని సరిచూసుకోవడం కష్టమవుతుంది.

ఉదాహరణకు, మీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద రూ. 45,000 వడ్డీ వచ్చి ఉంటే, ఆ వివరాలు మీ Form 26AS లేదా ఏఐఎస్ లో సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాంక్ కట్ చేసిన టీడీఎస్ డేటా మ్యాచ్ అవ్వకపోతే, మీరు బ్యాంక్‌ను సంప్రదించి దాన్ని సరిచేసుకోవడానికి సమయం పడుతుంది. జీతం టీడీఎస్, మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ వివరాల్లో ఏమైనా తేడాలు ఉంటే ముందే సరిచేసుకోవడం బెటర్. లాస్ట్ మినిట్‌లో ఇవన్నీ చూసుకోవడం కుదరక రీఫండ్స్ లేట్ అవ్వడమో లేదా ఐటీ నోటీసులు రావడమో జరుగుతుంది.

56
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపుపై ఆశలు వద్దు

లేట్ అయితే ఏముందిలే, గవర్నమెంట్ డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ చేస్తుందిలే అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ప్రభుత్వం సాధారణంగా ఐటీఆర్ గడువును పొడిగించదు. ఏదైనా పెద్ద ఎత్తున సాంకేతిక లోపాలు లేదా అనుకోని అత్యవసర పరిస్థితులు వస్తేనే డెడ్‌లైన్ మారుస్తారని నిపుణులు చెబుతున్నారు. డేట్ పొడిగిస్తారని ఊహించుకుని సైలెంట్‌గా ఉంటే, ఆ తర్వాత లేట్ ఫీజులు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి గడువు పెంపుపై అస్సలు ఆశలు పెట్టుకోవద్దని అంటున్నారు.

66
పాత పన్ను విధానమా? కొత్త పన్ను విధానమా? సరిగ్గా ఎంచుకోండి

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీ ఆఫీస్‌లో ఇచ్చే టాక్స్ డిక్లరేషన్‌లో ఏదో ఒక టాక్స్ రెజిమ్ ఎంచుకుని ఉంటారు. కానీ, సంవత్సరం మధ్యలో మీరు హోమ్ లోన్ తీసుకోని ఉండవచ్చు, లేదా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు కొని ఉండవచ్చు. అలాంటప్పుడు మీ పన్ను మినహాయింపులు మారతాయి.

ఉదాహరణకు, రూ. 15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి స్టాండర్డ్ డిడక్షన్లతో కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను కట్టవచ్చు. కానీ, అదే వ్యక్తి రూ. 2 లక్షల హోమ్ లోన్ వడ్డీ, సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 80D కింద రూ. 25,000 మినహాయింపులు పొందితే, వారికి పాత పన్ను విధానమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ రెండింటినీ సరిపోల్చి చూసుకుని, మీకు ఏది తక్కువ టాక్స్ పడుతుందో దాన్నే ఎంచుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories