మీ ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంటుతో ఇంకా లింక్ చేయలేదా ? చేయని వారు కచ్చితంగా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఆధార్ అనేది ఒకరి గుర్తింపును సూచించే 12-అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్. మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...
KYC
know your కస్టమర్ లేదా KYC చాల ముఖ్యమైనది అని తెలుసుకోండి. చాలా బ్యాంకులు ఆధార్‌ను బయోమెట్రిక్ వివరాలు, ఫొటోతో పాటు వాలిడిటీ అయ్యే గుర్తింపు కార్డుగా అంగీకరిస్తాయి. కాబట్టి KYC విధానాలను సజావుగా పూర్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ కేవలం ఆధార్ ఆధారంగానే అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ నిధులు, వేతనాలు కూడా ఆధార్ కార్డుల సహాయంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు.
ఐటీఆర్ ఫైలింగ్
ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు కూడా ఆధార్ చాల కీలకమైనది. పన్నుల చెల్లింపుకు అవసరమైన ప్రైమరీ డాక్యుమెంట్ అయిన పాన్ కార్డ్, తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ పరోక్షంగా కూడా ఎంతో అవసరం.
ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చర్యలు
ఈ గుర్తింపు డాక్యుమెంట్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక మోసాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. నకిలీ ఇన్‌వాయిస్‌లను నిరోధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రవేశపెట్టింది.