ట్రైన్ టికెట్ పోయిందా లేదా చిరిగిందా ? అయితే ఈ రూల్ తెలుసుకొండి ?

First Published Jun 24, 2024, 11:55 PM IST

ట్రైన్ టికెట్ పోయిందా  లేదా చిరిగిందా ? ఇలాంటప్పుడు ఎం చేయాలో చాలా మందికి తెలియదు. ఈ విషయంలో రైలు ప్రయాణికులు రైల్వే నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
 

రైలులో ప్రయాణించడానికి మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ  ట్రైన్ టిక్కెట్ అవసరం. అప్పుడే మీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. భారతీయ రైల్వేలో ప్రతిరోజు  లక్షల మంది ప్రయాణిస్తుంటారు.  
 

అది  లాంగ్  జర్నీ కావచ్చు లేదా చిన్న ప్రయాణం కావచ్చు. మిమ్మల్ని TT లేదా TC  అడిగితే  మీరు టిక్కెట్‌ చూపించాలి. మీ దగ్గర  సరైన   టిక్కెట్ లేకపోతే, మీపై చర్య తీసుకునే హక్కు TTకి ఉంది.
 

Latest Videos


కానీ కొన్నిసార్లు రైలు టిక్కెట్లు ప్రయాణంలో మిస్ అవుతుంటాయి లేదా చిరిగిపోతుంటాయి. దీంతో వీరి టికెట్‌ నిజంగా  ఉందా   లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంటుంది. మీరు కూడా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ టికెట్ పోగొట్టుకుంటే, ముందు TTEకి తెలియజేయండి.
 

పోగొట్టుకున్న టిక్కెట్‌ను రీప్లేస్ చేయడానికి TT మీకు డూప్లికేట్ టిక్కెట్‌ను జారీ చేస్తారు. అయితే ఈ టిక్కెట్టు ఫ్రీగా  ఇవ్వరు అని  గుర్తుంచుకోండి. దీని కోసం ప్రయాణికులు రైల్వేకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
 

ఒక్కో ట్రైన్ కి  వేర్వేరుగా ఛార్జీలు చెల్లించాలి. స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ఇంకా ఇతర  ట్రైన్స్  డూప్లికేట్ టికెట్ కోసం రూ.50 వసూలు చేయబడుతుంది.  
 

టికెట్ చిరిగిపోతే ఛార్జీ ఎంత? 
టికెట్ చిరిగితే, ప్రయాణీకుడు టికెట్‌ మొత్తంలో 25 శాతం చెల్లించాలి. ఆ తర్వాత మీకు డూప్లికేట్ టికెట్ వస్తుంది.

click me!