రైల్వే టిక్కెట్లపై డిస్కౌంట్ పొందడానికి అర్హులు వీరే..
హైస్పీడ్, ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లతో సహా ఇతర రైల్వే సేవల్లోనూ IRCTC డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం విద్యార్థులు, అంధులు, వికలాంగులు, పారా పెలాజిక్, క్షయ, క్యాన్సర్ రోగులు, కిడ్నీ, లెప్రసీ రోగులకు ఛార్జీల్లో రాయితీలు ఇస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భద్రతా బలగాల జీవిత భాగస్వాములు, యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు, జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు, లేబర్ అవార్డు గ్రహీతలు, పోలీసు అమరవీరుల భార్యలు, సీనియర్ సిటిజన్లు టిక్కెట్ ధరలో రాయితీలు పొందడానికి అర్హులు.
75 శాతం డిస్కౌంట్స్ వీరికే...
ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు IRCTC భారీ రాయితీలు ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షల కోసం రైలులో ప్రయాణించాల్సి వస్తే వారికి 75 శాతం వరకు రాయితీ ఇస్తోంది. అలాగే UPSC, సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ మెయిన్స్‌కు హాజరయ్యే విద్యార్థులు టిక్కెట్ ధరపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. రైల్వే గుర్తించిన గుండె జబ్బులు, కిడ్నీ రోగులు, క్యాన్సర్ రోగుల వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా టికెట్ ధరపై 75 శాతానికి పైగా తగ్గింపు ఇస్తున్నారు.