HDFC Flexi Cap Fund:పెట్టుబడుదారులకు భారీ లాభాలను అందించే పథకాల్లో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో రూ.10 వేల సిప్ పెట్టుబడిని ఏకంగా రూ.21 కోట్లు పొందవచ్చంట. మరి ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
Mutual Fund Investment: ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే. భయం మన ముందున్న అవకాశాలను అడ్డుకుంటుంది, అందుకే భయపడితే లక్ష్యాలను చేరుకోవడం కష్టం అవుతుంది. ఈ సిద్ధాంతం ఆర్థిక రంగానికి కూడా వర్తిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో నిలవాలని భావించే వారు, ఎలాంటి రిస్క్ కు సిద్దపడవారికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి బెటర్ ఆప్షన్ అని చెప్పాలి.
ఈక్విటీ ఫంఢ్స్ లో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులు సాధించవచ్చు. ఈ విషయాన్ని నిరూపించిన పలు ఫండ్లు ఉన్నాయి. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ( HDFC Mutual Fund) వారి హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ( HDFC Flexi Cap Fund)ఒకటి. చిన్నపెట్టుబడులతో కోటీశ్వరులను చేసే ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
25
రూ.10 వేల SIPతో రూ.21.50 కోట్లు!
హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: 1995, జనవరిలో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ లాంచ్ అయి 31 సంవత్సరాలు పూర్తవుతోంది. అప్పటి నుంచి క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) రూపంలో పెట్టుబడులు పెట్టిన వారి తలరాతలు మారిపోయాయి. అంటే.. అప్పటి నుంచి ఈ ఫండ్‌లో నెలకు రూ.10 వేల SIP పెట్టుబడి పెట్టిన వారు 31 సంవత్సరాల్లో దాన్ని రూ.21.50 కోట్లుగా మార్చుకున్నారు.
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టి, మార్కెట్ రిస్క్‌ను తగ్గించి అధిక లాభాలు పొందవచ్చు. పెట్టుబడి ముందే నిపుణుల సలహా తప్పనిసరి. వాల్యూ రీసర్చ్, మార్నింగ్‌స్టార్ సంస్థలు ఈ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాయి, అంటే అత్యుత్తమ రిటర్న్స్ ఇవ్వడంలో ఇది ప్రత్యేకంగా నిలిచింది.
35
ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
గత 5 సంవత్సరాల సిప్ రిటర్న్స్ XIRR విలువ 22.91% గా ఉంది. అంటే.. నెలకు రూ.10,000 SIP పెట్టినవారు 5 ఏళ్ల తర్వాత సుమారు రూ.10.42 లక్షలు అవుతుంది.
గత 3 సంవత్సరాల సిప్ రాబడులు సుమారు 20.86% గా ఉంది. అంటే.. నెలకు రూ.10,000 SIP పెట్టినవారు 3 ఏళ్ల తర్వాత సుమారు రూ.4.81 లక్షలు పొందుతారు.
మరో మాటలో చెప్పాలంటే, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా క్రమంగా పెట్టుబడి చేస్తే, మార్కెట్ పరిస్థితుల మేరకు మంచి వృద్ధి సాధించవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి (లంప్‌సమ్ పెట్టుబడి) పెట్టారు అనుకుందాం.
1995లో రూ.1 లక్ష పెట్టి ఇప్పటి వరకు కొనసాగితే ఇప్పుడు ఆ విలువ రూ.1.96 కోట్లు అవుతుంది. ఈ స్కీమ్ వార్షిక రాబడి CAGTరేటు: 18.83% గా ఉంది.
10 ఏండ్ల క్రితం రూ.1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.4.01 లక్షలు (CAGR 14.90%)
5 ఏండ్ల క్రితం రూ.1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.3.49 లక్షలు (CAGR 28.44%)
3 ఏండ్ల క్రితం రూ.1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.1.85 లక్షలు (CAGR 22.83%) అందుతాయి. అంటే, ఒకేసారి పెట్టుబడి పెట్టినా ఈ ఫండ్ ద్వారా మంచి వార్షిక వృద్ధి సాధించవచ్చు.
55
రిస్క్ తీసుకుంటేనే
రిస్క్ తీసుకుని, సరైన స్టాక్ మార్కెట్ ఫండ్స్ లోపెట్టుబడి చేస్తే మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తరహా స్కీమ్స్ దీర్ఘకాలిక పెట్టుబడికి బాగా సరిపోతాయి. SIP రూపంలో సాంకేతికంగా పెట్టుబడి చేస్తే చిన్న మొత్తం పెట్టుబడులే.. పెద్ద రాబడులుగా మారుతాయి.
గమనిక: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రాబడులు మారవచ్చు. అందువల్ల, పెట్టుబడులు చేయడానికి ముందే నిపుణుల సలహా తప్పనిసరి. సరిగా విశ్లేషించి, మీ ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.