iPhone Price: కొత్త మోడల్ ఐ ఫోన్ దిగిందంటే చాలు.. ముందు రోజు నుంచి దాన్ని కొనేందుకు రెడీగా ఉంటారు. అయితే ఐ ఫోన్ కొన్ని దేశాల్లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. మన భారతదేశంలో పోలిస్తే అతి తక్కువ ధరకు ఐఫోన్ ఏ ఏ దేశాల్లో లభిస్తుందో తెలుసుకోండి.
ఐఫోన్ కు అభిమానులు ఎక్కువ. కొత్త మోడల్ ఐఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు ఎంతోమంది. అయితే ఐఫోన్ ధరలు దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఐఫోన్ ధరలు అధికంగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంటాయి. మన దేశంలో మాత్రం ఐఫోన్ కొనాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించాలి. అందుకే మీరు విదేశాలకు వెళితే ఏ ఏ దేశాల్లో అతి తక్కువ ధరకు లభిస్తుందో మేము ఇక్కడ చెప్పాము. ఆ దేశాలకు వెళ్ళినప్పుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు తక్కువ ధరకే ఐఫోన్లు కొని తెచ్చుకోవచ్చు. చాలామంది విదేశాలకు వెళ్లేవారు ఈ పనే చేస్తూ ఉంటారు.
24
ఈ దేశాల్లో చాలా చీప్
జపాన్, హాంకాంగ్, దుబాయ్, కెనడా, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో చాలా తక్కువ ధరకే పొందవచ్చు. అమెరికాలో సాధారణంగానే ఐఫోన్ ధరలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం యాపిల్ కంపెనీకి ప్రధాన మార్కెట్ అమెరికాలోనే ఉంది. అవి ఉత్పత్తి అయ్యేది అక్కడే. కాబట్టి దిగుమతి ఖర్చులు కూడా ఉండవు. మార్కెట్లో పోటీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ధర తగ్గించే ఉంచాలి. అందుకే అమెరికా వెళ్ళినవారు ఐఫోన్ కొని తెచ్చుకుంటారు. ఇక జపాన్ లో కూడా ఐ ఫోన్లు చాలా తక్కువ ధరలోనే ఉంటాయి. జపాన్లో కరెన్సీ యెన్. యెన్ విలువలో మార్పులు, పన్ను రాయితీలు, పర్యాటకులకు లభించే టాక్స్ రిఫండ్ వంటివన్నీ కలిసివచ్చి ఐఫోన్ తక్కువ ధరకే అక్కడ లభిస్తుంది. ముఖ్యంగా హాంకాంగ్ లో అమ్మకపు పన్ను ఉండదు. కాబట్టి ఐఫోనే కాదు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా తక్కువ ధరకు లభిస్తాయి.
34
దుబాయ్ బెస్ట్
ఇక ఐఫోన్ కు మరో ప్రధాన మార్కెట్ దుబాయ్. ఐఫోన్ కొనుగోలుకు ప్రసిద్ధి చెందిన పెద్ద మార్కెట్ అక్కడ ఉంది. అక్కడ జీఎస్టీ వంటి పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. దిగుమతి కూడా చాలా సులభం.. కాబట్టి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే భారత్ నుంచి దుబాయ్ వెళ్లే వాళ్లంతా అక్కడే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కూడా స్థానిక మార్కెట్ పరిస్థితులు, పోటీ వల్ల ఐఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా మన దేశం కంటే మాత్రంతక్కువ ధరకు ఇక్కడ లభించే అవకాశాలు ఉన్నాయి.
భారత్ లో మాత్రం ఐఫోన్ ధరలు అధికమే. దీనికి ప్రధాన కారణం పన్నులు, దిగుమతి ఖర్చులు. మనదేశంలో మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాలపై అనేక రకాల పన్నులు ఉంటాయి. దీని వల్ల ధర పెరుగుతుంది. అంతే కాదు దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా తోడవుతుంది. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తక్కువ.. కాబట్టి విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల ధర అధికంగా ఉంటుంది. యాపిల్ కంపెనీ ప్రతి దేశంలోని పన్నులు, కరెన్సీ విలువలు, మార్కెట్ పరిస్థితులను పరిశీలించాకే ధరను నిర్ణయిస్తుంది. అయితే భారత్ లోనే యాపిల్ ఫోన్ల తయారీని పెంచేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది.