iPhone Air Discount: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్ ఎయిర్.. కొనేందుకు ఇదే మంచి టైమ్

Published : Apr 01, 2026, 11:29 AM IST

iPhone Air Discount: యాపిల్ ఐఫోన్ ఎయిర్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.  భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్ కార్ట్  ఈ ఫోన్ ను అందిస్తోంది. రూ.1,19,900 విలువైన ఈ మోడల్‌ను, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌తో కలిపి తక్కువ ధరకే కొనవచ్చు.

PREV
14
తక్కువ ధరకే ఐఫోన్ ఎయిర్

ఐఫోన్ అంటే ఎంతో మందికి ఇష్టం. కానీ కొనాలంటే మాత్రం చాలా మంది వెనుకాడతారు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ ఎయిర్‌ను రూ.99,900కి లిస్ట్ చేసింది. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించువాకుంటే, ధర సుమారు రూ.93,900కి తగ్గుతుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా కలిపితే, కొంతమంది కస్టమర్లు దీన్ని రూ.90,000 కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ భారీ డిస్కౌంట్ ఐఫోన్ ఎయిర్‌ను ఒక బెస్ట్ ఆప్షన్‌గా మార్చేసింది.

24
స్లిమ్ ఐఫోన్ ఎయిర్
ఐఫోన్ ఎయిర్ ప్రత్యేకత దాని డిజైన్. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో ఇదే అత్యంత సన్నని మోడల్. బరువైన ఫోన్లు వాడి విసిగిపోయిన వారికి ఇది ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. దీని స్లిమ్, తేలికైన డిజైనే ప్రధాన ఆకర్షణ.
34
ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్‌

ఈ ఫోన్ సన్నగా ఉన్నా, గట్టిదనం విషయంలో రాజీ పడలేదు. దీనికి వాడిన టైటానియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌తో పాటు మంచి గ్రిప్ కూడా ఇస్తాయి. చేతిలో పట్టుకుంటే చాలా విలువైనదిగా అనిపిస్తుంది.

ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్‌తో పనిచేస్తుంది. దీని పనితీరు ఐఫోన్ 17 ప్రో సిరీస్ ప్రాసెసర్‌తో పోల్చవచ్చు. రోజువారీ వాడకంలో యాప్స్ వెంటనే ఓపెన్ అవుతాయి. మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అన్ని పనులు వేగంగా జరిగిపోతాయి. దీంతో ఖరీదైన ఐఫోన్ వాడిన అనుభూతి కలుగుతుంది.

44
ఐఫోన్ ఎయిర్ కెమెరా

ఐఫోన్ ఎయిర్‌లోని 6.5-అంగుళాల స్క్రీన్ అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సన్నని బాడీలో ఉన్నా, కంటెంట్ చూడటానికి పెద్ద స్క్రీన్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే, దీన్ని ఒంటిచేత్తో సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్రైట్‌నెస్, కలర్స్ విషయంలో ఈ డిస్‌ప్లే తన సెగ్మెంట్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు.

ఐఫోన్ ఎయిర్‌లో ఒకే ఒక్క వెనుక కెమెరా ఉన్నప్పటికీ, 2x ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ సెన్సార్ చాలా సందర్భాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ వాడకానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అవసరమైన క్వాలిటీ ఫోటోలను ఈ కెమెరా అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories