Today Gold Rate: పసిడి ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్. కొన్నిరోజుల క్రితం యుద్ధ ఉద్రిక్తతలతో పడిపోయిన ధరలు… ఇప్పుడు మళ్లీ రాకెట్‌లా ఎగబాకుతున్నాయి. దీనికి కారణం ట్రంప్ నిర్ణయమే అని అంటున్నారు.
పసిడి ప్రియులకు మళ్లీ చుక్కలు కనిపిస్తున్నాయి. మళ్లీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెమ్మదిగా పెరుగుతోంది. రోజుకు తక్కువలో తక్కువ సగటున రూ.1000 పెరుగుతోంది. కొన్నిరోజుల క్రితం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పసిడి రేట్లు పాతాళానికి పడిపోయాయి. కానీ ఆ తర్వాత శాంతి చర్చలకు పిలుపునివ్వడంతో మళ్లీ పెరిగింది. మళ్లీ కొన్ని రోజులకు అమెరికా యుద్ధానికి సిద్ధమవ్వడంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యింది. ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతున్నారు. మొన్నటివరకు డాలర్ బలపడటంతో అటువైపు అడుగులు వేశారు. ఇప్పుడు సేఫ్ ఆప్షన్‍గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.
24
స్థిరంగా వెండి
అటు వెండి స్థిరంగా ఉంటున్నప్పటికీ ఒక్కోసారి సడెన్‍గా బాంబ్ పేల్చుతోంది. అయితే అమాంతం తగ్గిపోవడం లేదంటే...ఒక్కసారిగా పెరిగిపోవడం.దీంతో కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారు.
34
రూ.1,51,480కు చేరిన మేలిమి పసిడి
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‍లో ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,51,480కు చేరింది అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1800 ఎగబాకి రూ.1,38,850 పలుకుతోంది. విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు, కలకత్తా నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి.
ధరలు పెరగడానికి ట్రంప్ నిర్ణయమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రెండు మూడు వారాల్లో యుద్ధం ఆపేస్తామని ట్రంప్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‍తో కలిసి ఇరాన్‍పై దాడుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఓ వైపు ట్రంప్ ప్రకటన ఇలా ఉన్నా..ఇంకా యుద్ధం సద్దుమణగలేదు. దీంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. విమాన ఇంధనం ఎన్నడూ లేనంతగా ఈసారి రెట్టింపు పెరిగింది. కిలో లీటరుకు సుమారు రూ.2,12,450 రూపాయలకు చేరుకుంది. ఇంతకు ముందు రూ. 96,638 గా ఉండేది. ఇప్పుడు రెట్టింపైంది. దీంతో ఇక విమాన టికెట్ల ధరలు కూడా పెరగనున్నాయి. అటు పెట్రోల్ ధరలు, గ్యాస్ రేట్లు పెరగడంతో...సామాన్యుల జేబులకు చిల్లులు తప్పేలా లేదు. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు ద్రవ్యోల్బణం దెబ్బకు...ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.