iPhone 15 Price: భారీగా పడిపోయిన ఐఫోన్ 15 ధర, కొనేందుకు ఇంతకన్నా మంచి టైమ్ రాదు

Published : Dec 24, 2025, 10:44 AM IST

iPhone 15 Price: ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇప్పుడు దాని ధర చాలా తగ్గింది. అత్యంత తక్కువ ధరకే  ఇప్పుడు ఐఫోన్ 15 అందుబాటులోకి వచ్చింది. ఫ్లాట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, అదనపు బోనస్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ.36000కే దక్కించుకోవచ్చు.

PREV
15
ఐఫోన్ 15 తక్కువ ధరకే

ఐఫోన్ 15 మనదేశంలో చాలా పాపులర్ అయిన ఫోన్. ఎక్కువ డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఇది. కానీ దాని ధర వల్ల చాలామంది కొనడానికి వెనకడుగు వేశారు. ఇప్పుడు క్రోమా ఇయర్ ఎండ్ ఆఫర్‌తో ఐఫోన్ 15ను కేవలం రూ.36,000 వేలకే ఇవ్వబోతోంది. ఇప్పటివరకు ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. మీకు ఐఫోన్  వాడాలన్న కోరిక ఉంటే… ఐఫోన్ 15 కొనేందుకు ఇదే మంచి సమయం.

25
ఎందుక ధర తగ్గింది?

మనదేధశంలో 128GB ఐఫోన్ 15 లాంచ్ ధర మొదట్లో 79,900 రూపాయలుగా ఉంది. కానీ క్రోమా ఆఫర్‌లో ఇది కేవలం 57,990 రూపాయలకే దొరుకుతోంది. ఇక మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌ చేస్తే 14,000 రూపాయలకు వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే అదనంగా మరో 4,000 రూపాయలు బోనస్ గా లభిస్తుంది. దీంతో దీని ధర 36,490 రూపాలయకి తగ్గుతుంది. ఇంతకన్నా తక్కువ ధరకు ఈ ఫోన్ రావడం అసాధ్యం. దీన్ని కొనేందుకు ఇదే మంచి సమయం. 

35
EMI ఆప్షన్‌తో

ముప్పై ఆరు వేల రూపాయలు ఒకేసారి చెల్లించడం అందరి వల్ల కాదు.  ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని వారి కోసం EMI ఆప్షన్ అందిస్తోంది. దీనివల్ల ఎలాంటి అదనపు వడ్డీ లేకుండా ఐఫోన్ 15ను వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు.  నెలకు అతి తక్కువ ఈఎమ్ఐ చెల్లించి ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

45
ఐఫోన్ 15 పవర్‌ఫుల్ ఫీచర్లు

ఐఫోన్ 15లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అందులో  6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్, శక్తివంతమైన A16 బయోనిక్ చిప్, 48MP మెయిన్ కెమెరా, USB టైప్-C పోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 

55
ఇదే టైమ్ కొనేందుకు

ఐఫోన్ కొనాలని ఆశపడుతున్న వారికి ఇదే మంచి అవకాశం.  ధర ఎక్కువని ఇప్పటివరకు ఐఫోన్ 15 కొనకుండా ఆగిపోయి ఉంటే ఈ ఆఫర్ మీకోసమే. అసలు ధరలో దాదాపు సగం ధరకే ఐఫోన్ 15 పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories