Credit Card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? జ‌న‌వ‌రి నుంచి మార‌నున్న రూల్స్‌, బాదుడే బాదుడు

Published : Dec 23, 2025, 04:21 PM IST

Credit Card: 2025 ముగింపున‌కు ఇంకా కొన్ని రోజులే ఉంది. కాగా వ‌చ్చే ఏడాది నుంచి ప‌లు నిబంధ‌న‌లు మార‌నున్నాయి. అలాంటి వాటిలో క్రెడిట్ కార్డ్ రూల్స్ ఒక‌టి. ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల్లో కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌నుంది. 

PREV
15
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త నిబంధనలు

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కీలక మార్పులు ప్రకటించింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు, రివార్డ్ పాయింట్ల విధానంలో పెద్ద ఎత్తున సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.

25
ఆన్‌లైన్ గేమింగ్, వ్యాలెట్ లావాదేవీలపై అదనపు ఛార్జీలు

కొత్త నిబంధనల ప్రకారం డ్రీమ్ 11, ఎంపీఎల్ లాంటి ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో క్రెడిట్ కార్డ్ వాడితే లావాదేవీ మొత్తంపై 2 శాతం అదనపు ఫీజు వసూలు చేస్తారు. అలాగే అమెజాన్ పే, పేటీఎం వంటి డిజిటల్ వ్యాలెట్లలో రూ.5 వేలకుపైగా డబ్బు లోడ్ చేస్తే 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

35
ప్రయాణం, క్యాష్ బిల్ చెల్లింపులపై మార్పులు

ట్రావెల్ బుకింగ్స్ కోసం చేసే ఖర్చులు రూ.50 వేలను దాటితే వాటిపై 1 శాతం సర్‌చార్జ్ వర్తిస్తుంది. ఇకపై బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా క్యాష్ రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తే రూ.150 ఫీజు కట్టాల్సి ఉంటుంది.

45
ప్రీమియం కార్డులపై ఎక్కువ ప్రభావం

ఎమెరాల్డ్ మెటల్ లాంటి ప్రీమియం కార్డులపై ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సేవలు, ఫ్యూయెల్, రెంట్, పన్నులు, వ్యాలెట్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు ఇకపై ఇవ్వరు. కొత్త యాడ్-ఆన్ కార్డ్ కావాలంటే రూ.3,500 వన్‌టైమ్ ఫీజు చెల్లించాలి. ఎమెరాల్డ్, సాఫిరో కార్డులకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులపై నెలకు రూ.20 వేల వరకే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. మిడ్ రేంజ్ కార్డులకు ఈ పరిమితి రూ.10 వేల వరకు మాత్రమే ఉంటుంది.

55
ఎంటర్‌టైన్మెంట్ ఆఫర్లు, విదేశీ లావాదేవీలపై కోత

బుక్‌మైషోలో సినిమా టికెట్లపై ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్ పొందాలంటే గత మూడు నెలల్లో కనీసం రూ.25 వేల ఖర్చు చేసి ఉండాలి. 2026 ఫిబ్రవరి నుంచి ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డ్ హోల్డర్లకు ఈ ఆఫర్ పూర్తిగా రద్దు చేయనున్నారు. విదేశీ కరెన్సీ లావాదేవీలపై మార్కప్ ఛార్జీలను కూడా బ్యాంక్ సవరించింది.

మొత్తంగా చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ చేసిన ఈ మార్పులు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. 2026 జనవరి నుంచి ఇవి అమల్లోకి వస్తుండటంతో కార్డ్ హోల్డర్లు ముందుగానే తమ ఖర్చుల ప్రణాళికను తిరిగి పరిశీలించుకోవడం మంచిదని బ్యాంక్ సూచిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories