Union Budget 2022: గృహ రుణాల రీపేమెంట్ కోసం ప్రత్యేక విభాగం.. ఫిక్కీ డిమాండ్

First Published | Jan 13, 2022, 5:44 PM IST

న్యూఢిల్లీ: త్వరలో ప్రవేషపెట్టనున్న యూనియన్ బడ్జెట్(union budget) 2022-23లో  గృహ రుణాల అసలు(principak), వడ్డీ(intrest)  చెల్లింపులకు ప్రత్యేక మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టాలని ఇండస్ట్రీ ఛాంబర్ ఫిక్కీ(ficci) డిమాండ్ చేసింది.
 

"ప్రస్తుతం, గృహ రుణాల  అసలు  తిరిగి చెల్లించడం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హమైనది, అయితే రూ. 2 లక్షల వరకు వడ్డీ కాంపోనెంట్‌ను తిరిగి చెల్లించడం సెక్షన్ 24B కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది. అయితే, వివిధ పెట్టుబడి ఆప్షన్స్, చిన్న పొదుపు సాధనాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, పెన్షన్ ప్లాన్‌లు, సెక్షన్ 80C, చాలా మంది గృహ రుణగ్రహీతలు తమ మొత్తం హోమ్ లోన్ అసలు రీపేమెంట్‌లపై పన్ను మినహాయింపును పొందలేకపోతున్నారు" అని ఫిక్కీ తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో పేర్కొంది. 
 

అసలు, వడ్డీ కాంపోనెంట్స్ రెండింటికీ కలిపి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు తగ్గింపుతో గృహ రుణాల రీపేమెంట్ కోసం ప్రత్యేక విభాగం ఉండాలని ఫిక్కీ సిఫార్సు చేసింది. 

"అదే విధంగా ఎక్కువగా గృహ రుణగ్రహీతలకు ప్రత్యేకించి వారి గృహ రుణ పదవీకాలం ప్రారంభ సంవత్సరాల్లో సెక్షన్ 24B పై అప్పర్ క్యాప్  సరిపోదు. అందువల్ల, గృహ రుణాల చెల్లింపు కోసం ఒక ప్రత్యేక విభాగం ఉండాలి, దీనితో అసలు, వడ్డీ కాంపోనెంట్స్ రెండింటికీ కలిపి రూ. 5 లక్షల వరకు గరిష్టంగా తగ్గింపు ఉండాలి. ఇది గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను పెంచుతుంది ఇంకా హౌసింగ్ పరిశ్రమలో డిమాండ్ పెరుగుతుంది, "అని ఇండస్ట్రీ బాడీ పేర్కొంది. 

Latest Videos


అయితే బడ్జెట్ సెషన్ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది, మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022-23ను సమర్పించే అవకాశం ఉంది, ఇంకా ఇది రెండు సంవత్సరాల నుండి ఆచరణలో ఉంది.

click me!