కేవలం పన్ను ఆదాయం లేదా క్రిప్టో పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాలకు మాత్రమే రూల్స్, ఐడియాస్ రూపొందించడం కోసం ప్రభుత్వం సీనియర్ పన్ను సలహాదారులను సంప్రదించిందని ఒక నివేదిక పేర్కొంది.
అయితే, ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ బిల్లును తీసుకురావడానికి ముందు క్రిప్టోలకు పన్ను విధించడంపై ఎటువంటి నిర్ణయం సాధ్యం కాదు, అలాగే భారతదేశంలో అటువంటి వర్చువల్ ఆస్తులు ఎలా నియంత్రించబడతాయనే ముఖ్య లక్షణాలను హైలైట్ చేస్తుందని భావిస్తున్నారు. క్రిప్టో బిల్లు అసెట్ క్లాస్ నిర్వచించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్(rules, ideas)ను కూడా రూపొందించాలని భావిస్తున్నారు.
అందువల్ల, క్రిప్టోకరెన్సీ బిల్లులో పేర్కొన్న చట్టాలపై ఆధారపడి అటువంటి ఆస్తులపై ఎలా పన్ను విధించాలి అనే దానిపై అభిప్రాయాలను వెతకడానికి ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఇది.