బిల్ గేట్స్ నివసిస్తున్న ఇంటి విలువ ఎంతో తెలుసా.. అతని లైఫ్ స్టయిల్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

First Published Feb 8, 2021, 12:27 PM IST

బిల్ గేట్స్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతిష్టాత్మక  ఫోర్బ్స్ జాబితా ప్రకారం బిల్ గేట్స్  ప్రస్తుతం ప్రపంచంలో రెండవ ధనవంతుడు. కానీ  ఇంతకుముందు అతను ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. బిల్ గేట్స్ కేవలం 32 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని పేరు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చేర్చబడింది. 
 

అతన్ని 'దాన్ వీర్' అని కూడా అంటారు. 2007 సంవత్సరంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేయడానికి అతను సుమారు 1760 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. బిల్ గేట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
undefined
బిల్ గేట్స్ కాలేజీ డ్రాపౌట్. ప్రపంచంలోని విజయవంతమైన పారిశ్రామికవేత్తల లాగానే బిల్ గేట్స్ తన కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేశాడు.
undefined
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హార్వర్డ్ యూనివేర్సిటీలో చదువుకోవాలని కలలు కంటుంటారు. మైక్రోసాఫ్ట్ తో తన కలను నెరవేర్చడానికి అలాంటి యూనివేర్సిటీని కూడా విడిచిపెట్టాడు.
undefined
ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికి ప్రతి సంవత్సరం కనీసం 50 పుస్తకాలను తాను చదువుతున్నానని బిల్ గేట్స్ పేర్కొన్నాడు. తాను చదవడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని అందులో ఒకటి కొత్త విషయాలను నేర్చుకోవటం, రెండవది అర్ధం చేసుకోవటం అని ఆయన చెప్పారు.
undefined
1977లో అంటే బిల్ గేట్స్ 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, న్యూ మెక్సికోలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు అరెస్టయ్యాడు. ఆ సమయంలో అతను తన కారును చాలా వేగంగా నడుపుతున్నాడు ఇంకో విషయం ఏంటంటే అప్పుడు అతనికి లైసెన్స్ కూడా లేదు తెలిపాడు.
undefined
బిల్ గేట్స్ నివసించే ఇంటి విలువ సుమారు 800 కోట్ల రూపాయలు. స్విమ్మింగ్ పూల్ తో సహా అన్ని సౌకర్యాలు కలిగిన అతని ఇంటిలో భారీ గోపురం లాంటి లైబ్రరీ కూడా ఉంది, ఇందులో లియోనార్డో ది విన్సీ మాన్యుస్క్రిప్ట్ కూడా ఉంది. 1994 లో జరిగిన వేలంలో ఈ మాన్యుస్క్రిప్ట్‌ను కొనుగోలు చేశాడు.మాన్యుస్క్రిప్ట్‌ అంటే ప్రింట్ లేదా పబ్లిష్ చేయకముందు చేతితో రాసిన పుస్తకం.
undefined
click me!