రతన్ టాటాపై సోషల్ మీడియాలో పోస్టులు.. అలాంటి ప్రచారం చేయవద్దు అంటూ ట్వీట్..

First Published Feb 6, 2021, 4:47 PM IST

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పుట్టిన ఏదైనా ఒక వార్తా  అతి తక్కువ సమయంలోనే విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ప్రస్తుతం  ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారతీయ పారిశ్రామికవేత్త,  టాటా సన్స్  మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
 

దీనిపై రతన్ టాటా స్వయంగా ట్వీట్ ద్వారా స్పందించారు. "ప్రజల మనోభావాలను నేను అభినందిస్తున్నాను, కాని అలాంటి ప్రచారాలను వెంటనే ఆపండి" అని ట్వీట్ లో అన్నారు. రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని ట్విట్టర్‌లో కొంత మంది ఫాలోవర్లు డిమాండ్ చేస్తు పోస్టులు పెడుతున్నారు.
undefined
ఈ ప్రచారాన్ని ఆపాలని విజ్ఞప్తి చేస్తూ రతన్ టాటా తన ట్వీట్ లో "ఒక అవార్డు కోసం సోషల్ మీడియాలో ప్రజలు వ్యక్తం చేసిన మనోభావాలను నేను అభినందిస్తున్నాను, అయితే అలాంటి ప్రచారాలు ఆపివేయాలని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను భారతీయునిగా ఉండటం, భారతదేశ పురోగతి, శ్రేయస్సుకు దోహదపడే అదృష్టవంతుడిని అంటూ పోస్ట్ పెట్టారు.
undefined
రతన్ టాటా ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ కూడా విస్తృతంగా వైరల్ అవుతుంది. మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వివేక్ బింద్రా కూడా రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని ట్వీట్ చేశారు.
undefined
డాక్టర్ బింద్రా తన ట్వీట్‌లో 'నేటి తరం వ్యవస్థాపకులు భారత్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లగలరని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.
undefined
భారత ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భారత్ రత్న అవార్డు ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా ప్రచారంలో చేరండి అలాగే వీలైనంత వరకు ఈ ట్వీట్‌కి రీట్వీట్ చేయండి. దీని తరువాత రతన్ టాటా అలాగే భరత్రత్న ఫోర్ రాటన్ టాటా హ్యాష్‌ ట్యాగ్‌లు టాప్ ట్రెండ్‌లోకి వచ్చాయి.
undefined
click me!