ఒకప్పుడు చిన్న అద్దె ఇంట్లో ఉన్న అమెజాన్ సి‌ఈ‌ఓ.. ఇప్పుడు సెకనుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..

First Published Feb 9, 2021, 2:43 PM IST

జెఫ్ బెజోస్ గురించి తెలియని వారు ప్ర్పంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది ఉంటారు. నేడు ఆయన  ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడు, కానీ కొద్ది రోజుల క్రితం  అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతను ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు.
 

57 ఏళ్ల జెఫ్ బెజోస్ 1986లో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత కంప్యూటర్ సైన్స్ లో ఎక్కువ కాలం పాటు పనిచేశాడు. ఆ తరువాత అతను అనేక ఇతర ప్రదేశాలలో కూడా పనిచేశాడు. జెఫ్ బెజోస్ ఒకప్పుడు ఒక పడకగది ఉన్న అద్దె ఇంట్లో నివసించిన కాలం కూడా ఉంది, కాని ఈ రోజు అతను అమెరికా అంతటా అనేక ఖరీదైన ఇళ్ళు, వేలాది ఎకరాల భూమి, లగ్జరీ కార్లు అతని సొంతం.
undefined
జెఫ్ బెజోస్ పూర్తి పేరు జెఫ్ ప్రెస్టన్ బెజోస్. ఒక నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ 2020 సంవత్సరంలో ప్రతి సెకనుకు 1.81 లక్షల రూపాయలు సంపాదించారు. అంటే ఇప్పుడు ఎంత డబ్బును కలిగి ఉంటారో మీరు అంచనా వేయవచ్చు. అతని కల ఏమిటంటే అతను చంద్రుడిపై నివసించడం. అతని సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి పర్యాటకులను అంతరిక్షంలోకి పంపడం కూడా ప్రారంభించబోతోంది.
undefined
జెఫ్ బెజోస్ దినచర్య ఎలా ఉంటుంది ?2018లో ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ వాషింగ్టన్ డిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఫ్ బెజోస్ తన దినచర్యను తెలిపాడు. అయితే రోజుకి ఎనిమిది గంటల పాటు నిద్రలో తాను ఎప్పుడూ రాజీపడలేదని పేర్కొన్నాడు. అతను రాత్రి పూట నిద్రపోయి ఉదయాన్నే లేస్తాడు. ఉదయం లేచాక హాయిగా కాఫీ తగిన తరువాత అల్పాహారం తీసుకోవడం ఆ తరువాత తన పనిలో పాల్గొనడం చేస్తానని తెలిపాడు.
undefined
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, జెఫ్ బెజోస్ న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఇంటి విలువ ఏడు బిలియన్ రూపాయలు. అలాగే వాషింగ్టన్ డిసిలోని అతని ఇంటి విలువ 1 బిలియన్ రూపాయలకు పైగా ఉండగా, కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లోని అతని ఇంటి విలువ 12 బిలియన్ రూపాయలకు పైగా ఉంటుంది. ఇది కాకుండా అతనికి అనేక విలాసవంతమైన ఇళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి.
undefined
జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీకి గతంలో కాడబ్రా అని పేరు పెట్టాలని అనుకున్నారట, కాని తరువాత దీనిని అమెజాన్ గా మార్చారు. దీనికి కారణం అతని సహోద్యోగులలో ఒకరు కాడాబ్రాకు బదులుగా కంపెనీ పేరును సరిగ్గా పలకలేకపోయారు. తరువాత అతనికి కంపెనీ పేరును ప్రజలు సరిగ్గా చదవలేకపోతున్నారని అతనికి అనిపించింది, ఆ తర్వాత ఆ పేరు మార్చబడింది.
undefined
undefined
click me!