లోకల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను పూర్తిగా నమ్మడం కూడా తప్పే. వాళ్ళు మీ అవసరాలకంటే వాళ్ళ కమిషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పాలసీలు అంటగట్టేస్తారు. కాబట్టి, అన్ని విషయాలు తెలుసుకోండి. వేర్వేరు కవరేజ్ ఆప్షన్స్, లాభాలు, నష్టాలు చూడండి. ఆన్‌లైన్‌లో పాలసీలను పోల్చి చూడటం మంచిది. మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే పాలసీని కనుక్కోవడం తేలిక అవుతుంది.