Invest in Gold: బంగారం ఏ రూపంలో కొంటే ఎక్కువ లాభమో తెలుసా?

Published : Mar 01, 2025, 05:49 PM IST

Best Ways to Invest in Gold: బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మీరు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఏ రూపంలో బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Invest in Gold: బంగారం ఏ రూపంలో కొంటే ఎక్కువ లాభమో తెలుసా?

చాలా ఇళ్లల్లో ఏదో ఒక రూపంలో బంగారం ఉంటుంది. ప్రజలు బంగారాన్ని మంచి పెట్టుబడిలా చూస్తారు. అందుకే పండుగలు, ప్రత్యేక రోజుల్లో బంగారం కొంటారు. ఇప్పుడు బంగారం ధర పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బంగారం కొనేవాళ్లు ఆభరణాల రూపంలోనే కాకుండా ఇంకా ఏయే రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చో చూద్దాం.

25

బంగారు పొదుపు పథకాలు

చాలా జ్యూయెలరీ షాపులు బంగారు పొదుపు పథకాలను ప్రవేశపెట్టాయి. బంగారు లేదా నగలు పొదుపు పథకాల్లో కొంతకాలం పాటు నెలనెలా డబ్బులు కట్టాలి. గడువు పూర్తయ్యాక బోనస్ అమౌంట్తో కలిపి మీరు కట్టిన డబ్బుకు సమానమైన విలువైన బంగారాన్ని అదే షాపులో తీసుకోవచ్చు. కొన్ని షాపుల్లో బహుమతులు కూడా ఇస్తారు.

35

బంగారు నాణేలు

బంగారు నాణేలను జ్యూయెలరీ షాపుల్లో, బ్యాంకుల్లో, ఫైనాన్స్ కంపెనీల్లో, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా కొనొచ్చు. 24 క్యారెట్ల బంగారు నాణేలు, బిస్కెట్లు 999 స్వచ్ఛతతో దొరుకుతాయి. కొనేటప్పుడు ప్యాకింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. 0.5 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు బరువున్న బంగారు నాణేలు మార్కెట్లో దొరుకుతాయి.

45

సార్వభౌమ బంగారు బాండ్లు

బంగారు బాండ్లను (Sovereign Gold Bonds) ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కానీ ప్రభుత్వం వీటిని ఎప్పుడో ఒకసారి మాత్రమే అమ్ముతుంది. సంవత్సరానికి రెండుసార్లు వారం రోజుల పాటు అమ్మకాలు జరుగుతాయి. మీరు వీటిని ఫాలో అయితే వాటిని సరైన టైమ్ లో కొనడానికి అవకాశం ఉంటుంది. 

55

డిజిటల్ బంగారం

పేటిఎం,  ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనొచ్చు. ఈ డిజిటల్ బంగారం రూపాయి నుంచి కూడా దొరుకుతుంది. చాలా కంపెనీలు సేఫ్ గోల్డ్ తో కలిసి అమ్ముతున్నాయి.

గోల్డ్ ETF

తక్కువ ఖర్చుతో పేపర్ గోల్డ్ కొనడానికి మరో మార్గం గోల్డ్ ETF. ఇలాంటి పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో జరుగుతాయి. దీని ధర బంగారం అసలు ధరకు దగ్గరగా ఉంటుంది.

click me!

Recommended Stories