ఈ వారం బంగారం ధర ఎంత?
దీపావళి ముగిసినప్పటి నుంచి బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. నవంబర్ మొదటి వారంలో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం బంగారం ధర 10 గ్రాములకు 1764 రూపాయలు పెరిగింది. వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.52,277 వద్ద ముగిసింది. కాగా, ఈ వారం ప్రారంభ రోజు సోమవారం బంగారం ధరలు రూ.50,960గా ఉన్నాయి. దీంతో బుధవారం ధరలు రూ.51,502కు చేరుకున్నాయి. మరోవైపు బంగారం ధరలు గురువారం రూ.51,619, శుక్రవారం రూ.52,277కు చేరాయి.