రోజుకు 16 గంటలు పనిచేయాల్సిందే, ట్విట్టర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ కొత్తరూల్..డూ ఆర్ డై అంటున్న కొత్త బాస్

First Published Nov 11, 2022, 7:44 PM IST

ట్విట్టర్ ఉద్యోగులకు  కొత్త బాస్ ఎలాన్ మస్క్, కొత్త కొత్త రూల్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు. సీఈవోతో సహా ఇప్పటికే  సగం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్, మిగతా ఉద్యోగులకు కూడా  చుక్కలు చూపిస్తున్నాడు.

ఈసారి ఉద్యోగులు వారానికి 80 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని మస్క్ కొత్త ఫార్మనా జారీ చేశాడు. వారానికి 80 గంటలు అంటే ప్రతిరోజూ 16 గంటల పని. అలాగే, ఇప్పుడు ఉచిత ఆహారం కూడా అందుబాటులో ఉండదు. ఇంతకుముందు, మస్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కూడా తొలగించారు. 
 

ఎలాన్ మస్క్ ట్విట్టర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత , కంపెనీలో సిబ్బందిని ఉద్దేశించి మొదటి సారి ప్రసంగించారు. ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి ప్రకారం, ఎలాన్ మస్క్ మాట్లాడుతూ, " మీరు ఉద్యోగంలో కొనసాగలేము అనుకుంటే  వెంటనే మీ రాజీనామా ఆమోదిస్తాను." అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒక ముక్కలో చెప్పాలంటే డూ ఆర్ డై అంటూ ఉద్యోగులను మోటివేట్ చేశాడు. 
 

44 బిలియన్ డాలర్లకు కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ ఉద్యోగులను ఉద్దేశించి ఎలాన్ మస్క్ తన మొదటి సమావేశంలో, అతి త్వరలో ఆదాయం రావడం ప్రారంభించకపోతే కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందని అన్నారు.
 

elon musk

తొలగింపులు ఇంకా కొనసాగుతున్నాయి
ఎలాన్ మస్క్ మొదట CEO పరాగ్ అగర్వాల్‌తో సహా టాప్ మేనేజ్‌మెంట్‌లోని అనేక మంది అధికారులను తొలగించారు. ఆ తర్వాత దాదాపు 50 శాతం మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించారు. తొలగింపు ప్రక్రియ, లేదా ఉద్యోగుల బహిష్కరణ ఇంకా ముగియలేదని చెప్పాలి.

elon musk

గురువారం మరో ఎగ్జిక్యూటివ్‌ని తొలగించారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కొత్త జట్టులో జోయెల్ రోత్ ముఖ్యమైన భాగం కాగా, మరొక అధికారి, రాబిన్ వీలర్ కూడా రాజీనామా చేసాడు, కానీ మస్క్ అతన్ని ఆపగలిగాడు.

ఉద్యోగులను భయపెట్టడం మస్క్ శైలి
ట్విట్టర్ విషయానికొస్తే, ఎలాన్ మస్క్ తన ఉద్యోగులను భయపెడుతున్నాడని మీరు అనుకుంటే, అది అతని స్టైల్ అని గతంలో టెస్లాలో పనిచేసిన మేనేజ్ మెంట్ లో పనిచేసిన వ్యక్తి ఒకరు తెలిపారు..ఎలాన్ మస్క్ తన ఉద్యోగులను గతంలో టెస్లా కంపెనీలో కూడా వారిని ప్రేరేపించడానికి భయపెట్టేవాడని చెప్పాడు. ఇది అతని మేనేజ్ మెంట్ నిర్వహణ తీరు అని అన్నారు. ఉద్యోగులు కష్టపడి పనిచేయడం లేదని, ట్విట్టర్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందని మస్క్ నిరూపించడానికి ప్రయత్నిస్తాడని టెస్లా మాజీ ఉద్యోగి తెలిపారు. 
 

మస్క్ కనీస సంఖ్యలో ఉద్యోగుల నుండి గరిష్ట పనిని రాబట్టాలని అనుకుంటాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారంలో తాను 120 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పారు. మస్క్ తన ఉద్యోగులకు కూడా ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని సందేశం పంపడానికి ప్రయత్నించారని సన్నిహితులు చెబుతున్నారు. 

click me!