Multibagger Stocks: భారత డిఫెన్స్ సెక్టార్ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యాలతో దూసుకుపోతోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ వృద్ధికి కీలకంగా మారింది. డిఫెన్స్ రంగం అభివృద్ధి చెందుతుండటంతో నేరుగా స్టాక్స్‌లో కాకుండా..
భారత డిఫెన్స్ సెక్టార్ ఇటీవల అద్భుతమైన మార్పులతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తోంది. భారత్ ఇప్పుడు కేవలం రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశం నుంచి ఆవిష్కరణలకు, అధునాతన తయారీకి కేంద్రంగా మారుతోంది. దీనికి నిదర్శనంగా, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లాంటి ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక సాంకేతికతలు నిలుస్తున్నాయి.
25
సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా..
సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా రూపొందించిన భార్గవాస్త్ర అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థ ఒకేసారి 60 మైక్రో-క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంతో ప్రపంచంలోనే హై-ఎండ్ టెక్నాలజీగా రూపొందింది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి సాంకేతికత లేదు.
35
మేక్ ఇన్ ఇండియా చొరవతో
మేక్ ఇన్ ఇండియా చొరవతో, గత ఐదేళ్లలో రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి(R&D) కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. గతంలో రక్షణ బడ్జెట్‌లో 90 శాతం దిగుమతులకు వెళ్లేది. కానీ ఇప్పుడు 80 శాతం ఉత్పత్తులు దేశీయంగానే తయారవుతున్నాయి. హెచ్ఏఎల్, బీఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సోలార్ ఇండస్ట్రీస్ లాంటి ప్రైవేటు కంపెనీలు ఈ మార్పుకు దోహదపడుతున్నాయి.
భారత్ రక్షణ ఎగుమతులలో కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. ఒకప్పుడు దిగుమతిదారుగా ఉన్న భారత్, ఈ సంవత్సరం 30,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా భారత్ సాంకేతిక, తయారీ సామర్థ్యాలకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితులు, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు రక్షణ బడ్జెట్‌లను పెంచుతున్నాయి.
55
పెట్టుబడి అవకాశాల విషయానికి వస్తే..
పెట్టుబడి అవకాశాల విషయానికి వస్తే.. డిఫెన్స్ సెక్టార్‌లోని ఒక్కో స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం కంటే, ఈటీఎఫ్‌లు(ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), ఇండెక్స్ ఫండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని బిజినెస్ నిపుణులు సూచించారు. మార్కెట్ అస్థిరత దృష్ట్యా(రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు కూడా 4-5 శాతం పడిపోవడాన్ని ఉదహరిస్తూ), స్టాక్-నిర్దిష్ట విధానం కంటే థీమాటిక్ పెట్టుబడులు ఉత్తమమని అభిప్రాయపడ్డారు.