Union Budget: పండగ చేస్కోండి.. బడ్జెట్ తర్వాత ధరలు తగ్గే వస్తువులివే. మరి పెరిగేవి ఏంటంటే.?

Published : Feb 01, 2026, 03:22 PM IST

Union Budget: 2026 బ‌డ్జెట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బ‌డ్జెట్‌తో కొన్ని వ‌స్తువుల‌పై నేరుగా ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇంత‌కీ కొత్త బ‌డ్జెట్ కార‌ణంగా ధ‌ర‌లు త‌గ్గే వ‌స్తువులు ఏవి.? పెరిగేవి ఏవి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
బ‌డ్జెట్ ప్ర‌ధాన ఉద్దేశం ఏంటంటే.?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెంపుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. దీనితో పాటు కొన్ని వస్తువుల ధరలు తగ్గేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు కొన్ని రంగాల్లో ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.

25
Budget 2026లో చౌకగా మారనున్న వస్తువులు

ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు, విధాన పరమైన సడలింపుల కారణంగా కింది వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

* వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులు

* క్యాన్సర్ రోగులకు ఉపయోగించే 17 కీలక ఔషధాలు

* 7 అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, ప్రత్యేక ఆహారం

* లెదర్ ఉత్పత్తులు, ముఖ్యంగా పాదరక్షలు

* టెక్స్టైల్ దుస్తులు

* సీఫుడ్ ఉత్పత్తులు

* విదేశీ టూర్ ప్యాకేజీలు

* బ్యాటరీల తయారీలో ఉపయోగించే లిథియం-అయాన్ సెల్స్

* సోలార్ గ్లాస్

* కీలక ఖనిజాలు

* బయోగ్యాస్ మిశ్రమం కలిగిన CNG

* విమానాల తయారీకి అవసరమైన భాగాలు

* మైక్రోవేవ్ ఓవెన్

* విదేశీ విద్య ఖర్చులు

35
ఖరీదయ్యే అవకాశం ఉన్న వస్తువులు, సేవలు

కొన్ని పన్ను మార్పులు, కఠిన నిబంధనల కారణంగా ఈ అంశాలు ఖరీదవుతాయని అంచనా.

* ఆల్క‌హాల్‌

* సిగరెట్లు

* అణు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన భాగాలు

* ఖనిజాలు, ఇనుప ఖనిజం, బొగ్గు

* ఆదాయపు పన్ను తప్పుదారి పట్టింపు కేసులు

* స్టాక్ ఆప్షన్స్, ఫ్యూచర్ ట్రేడింగ్ కార్యకలాపాలు

45
క్యాపిటల్ మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బడ్జెట్ తాత్కాలిక లాభాలకంటే దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి పెట్టింది. ఆర్థిక లోటు నియంత్రణ, రూ. 12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, తయారీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే అంశాలుగా మారాయి. కొంతమేర ట్రేడింగ్ ఖర్చులు పెరిగినా, దీర్ఘకాల పెట్టుబడులకు అనుకూల వాతావరణం కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

55
సామాన్య ప్రజలపై ప్రభావం

Budget 2026లో తీసుకున్న నిర్ణయాలు సాధారణ ప్రజల జీవన ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఔషధాలు, దుస్తులు, సీఫుడ్ వంటి అవసరమైన వస్తువులు చౌకగా మారడం ఉపశమనాన్ని ఇస్తే, ఆల్కహాల్, సిగరెట్లు, పెట్టుబడి లావాదేవీలపై ఖర్చులు పెరగడం కొందరిపై భారం పెంచవచ్చు. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వృద్ధికి, దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడేలా రూపుదిద్దుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories