Jainam Jain: ఇతను వ్యాపార రంగంలో వైభవ్ సూర్యవంశీ...14 ఏళ్లకే అద్భుతాలు

Published : Jul 05, 2026, 10:00 AM IST

Jainam Jain: క్రికెట్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం చూశాం. ఇప్పుడు వ్యాపారంలో 14 ఏళ్ల భారత సంతతి బాలుడు ఔరా అనిపిస్తున్నాడు. బుర్జ్ ఖలీఫాలో 'మెంగో ఇంజిన్' పేరుతో AI కంపెనీ ప్రారంభించాడు. 105 డేస్ లో 10వ తరగతి పూర్తి చేసిన ఆ బాలుడి కథ చూద్దాం. 

PREV
15
ఎవరీ జైనం జైన్?

క్రికెట్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం చూశాం. ఇప్పుడు వ్యాపారంలో 14 ఏళ్ల భారత సంతతి బాలుడు ఔరా అనిపిస్తున్నాడు. బుర్జ్ ఖలీఫాలో 'మెంగో ఇంజిన్' పేరుతో AI కంపెనీ ప్రారంభించేశాడు. సాధారణంగా 14 ఏళ్ల పిల్లలు స్కూల్, వీడియో గేమ్స్‌తో బిజీగా ఉంటారు. కానీ భారత సంతతికి చెందిన జైనం జైన్ మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్న వయసులోనే AI రంగంలోకి అడుగుపెట్టి, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో 'మెంగో ఇంజిన్' అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఈ కంపెనీ వ్యాపార సంస్థలకు మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్, కంటెంట్ క్రియేషన్ వంటి పనుల్లో సహాయపడుతుంది. బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్ ఉన్న అత్యంత చిన్న వయస్సు ఈ బాలుడిదే.

25
6 ఏళ్ల వయసులోనే వ్యాపారంపై ఆసక్తి
జైనం వ్యాపార ప్రయాణం కేవలం 6 ఏళ్ల వయసులోనే మొదలైంది. తన తండ్రితో కలిసి బిజినెస్ మీటింగ్‌లకు వెళ్లేవాడు. అప్పుడే అతనికి వ్యాపార ప్రపంచంపై ఆసక్తి కలిగింది. అప్పటి నుంచి పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నాలజీపై దృష్టి పెట్టాడు.
35
105 రోజుల్లో 10th సిలబస్ పూర్తి చేసిన జైనం
జైనం చదువులో చాలా చురుకు. తన 13వ ఏట, IGCSE 10వ తరగతి సిలబస్‌ను కేవలం 105 రోజుల్లోనే పూర్తి చేశాడు. తన కంపెనీని నిర్మించడం, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం కోసం సమయం ఆదా చేసేందుకే ఇలా చేశాడు.
45
జైనం జైన్ విజయాలు

జైనం జైన్ సాధించిన విజయాల జాబితా ఇది. ప్రతిష్టాత్మక TEDx వేదికపై ప్రసంగం - తన పేరు మీద రెండు పేటెంట్లు - ఒక పుస్తకం కూడా రాశాడు - ఇతని యూట్యూబ్ ఛానెల్‌కు 1,45,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు - 50 రోజుల్లో 50 పుస్తకాలు చదివేయడం తనకు అలవాటు.

55
ఈ తరానికి జైనం ఒక స్ఫూర్తి

విజయానికి వయసు అడ్డంకి కాదు. మన ఆలోచనలు, నిరంతర శ్రమ, క్రమశిక్షణ మనల్ని గమ్యానికి చేర్చుతాయని జైనం నమ్ముతాడు. ప్రపంచం గుర్తించేంత పెద్ద కంపెనీని నిర్మించడమే అతని తదుపరి లక్ష్యమట. భారత సంతతికి చెందిన ఈ బాలుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేటి యువ తరానికి జైనం జైన్ నిజంగా ఒక పెద్ద స్ఫూర్తి అనే చెప్పుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories