అంగారకుడిపై నీటి జాడలు.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు

First Published | Aug 13, 2024, 9:37 PM IST

సౌర కుటుంబంలో ఒకటైన అంగారకుడి పై నీరు ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.  ఇదే నిజమైతే మరి జీవం కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధన చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మార్స్ పై నీటి జాడలపై శాస్త్రవేత్తలు తెలిపిన మరిన్ని వివరాలు..
 

సౌర కుటుంబంలో భూమికి దగ్గరగా ఉన్నది అంగారక గ్రహం. దాని ఉపరితలం కింద భారీ మొత్తంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి మీద ఒక సముద్రంలో ఉండే నీరంత ఉంటుందని భావిస్తున్నారు. నాసాకు చెందిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్ ఇచ్చిన మార్స్ ప్రకంపనల సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

రెండు సంవత్సరాల క్రితమే మార్స్ ఇన్సైడ్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే ఆ సమయంలో సుమారు 1300 అంగారక కంపాలు(మార్స్ క్వేక్)లను గుర్తించింది. వాటిని పరిశోధించగా అంగారకుడు ఉపరితలం కింద నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 


అంగారకుడు ఉపరితలం కింద 11.5 k.m నుంచి 20 km లోతులో నదులు, సరస్సుల్లో నీరు ఉందని గుర్తించారు. మార్స్ బహుశా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి నుంచి సపరేట్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. నీటి జాడలు ఉన్న కారణం జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోకు చెందిన ప్రముఖ పరిశోధకుడు వాషన్ రైట్ తెలిపారు. 

మూడు బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహం తడిగా,  నివాసయోగ్యంగా ఉందని పరిశోధనల ద్వారా తెలిసిందన్నారు. అయితే మార్స్ వాతావరణంలో వచ్చిన మార్పుల ఆధారంగా అది నీటిని కోల్పోయిందన్నారు. అందుకే అది ఇప్పుడు బూడిదతో నిండిన గ్రహంగా కనిపిస్తుందన్నారు. మార్స్ ఉపరితలంపై నీరు ఆవిరైపోయి ఉండొచ్చు లేదా అడుగుకు వెళ్ళిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా అంగారకుడిపై నీరు ఉండటం భవిష్యత్తులో అక్కడ నివాసానికి అవకాశాలను కల్పించేలా ఉన్నాయి.
 

Latest Videos

click me!