పోస్టాఫీస్‌లో డ్రైవర్ జాబ్స్ కి నోటిఫికేషన్: 10వ తరగతే అర్హత

Published : Jan 23, 2025, 08:04 PM IST

ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10వ తరగతి పాసైన వారు ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి? జీతం లాంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
14
పోస్టాఫీస్‌లో డ్రైవర్ జాబ్స్ కి నోటిఫికేషన్: 10వ తరగతే అర్హత

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలని అనుకునే వారికి శుభవార్త. కేవలం 10వ తరగతి పాసైతే చాలు ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి గలవారు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

24

మొత్తం 25 డ్రైవర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు

సెంట్రల్ రీజియన్: 1

MMS, చెన్నై: 15

సదరన్ రీజియన్: 4

వెస్ట్రన్ రీజియన్: 5

మొత్తం: 25

34

ఈ డ్రైవింగ్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అంతేకాకుండా లైట్ & హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్స్ పరిజ్ఞానం ఉంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 

44

ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు. జీతం ప్రారంభంలో రూ.19,900 ఇస్తారు. ఒకవేళ మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఈ క్రింది చిరునామాకు పంపాలి.

సీనియర్ మేనేజర్ ఆఫీస్, మెయిల్ మోటార్ సర్వీస్, నెం. 37, క్రీమ్స్ రోడ్, చెన్నై - 600006.

click me!

Recommended Stories