ఒకే టవర్ పై బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్-ఐడియా కంపెనీలు తమ సిగ్నలింగ్ డివైజ్ ల ద్వారా సిగ్నల్స్ అందించడం వల్ల ప్రజలు అదనపు ఖర్చులు లేకుండా మెరుగైన మొబైల్ సేవలను పొందుతారు.
కేంద్ర ప్రభుత్వం దాదాపు 27,000 టవర్‌లను ఉపయోగించి, 35,400 కంటే ఎక్కువ గ్రామీణ, మారుమూల గ్రామాలకు నమ్మకమైన 4G కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఐసిఆర్ ప్రాజెక్ట్ ను చేపట్టింది.