దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం, సంస్కరణల కారణంగా ఆసియా మార్కెట్లలో భారత స్టాక్ మార్కెట్లు అత్యంత బుల్లిష్ గా మారాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ రీసెర్చ్ ఈక్విటీస్ హెడ్ క్రిస్టఫర్ వుడ్స్ (Christopher Wood) పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో 50 ఏళ్ల పాటు సుస్థిరంగా పాలించబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా, స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ఓపెన్ అయ్యింది. మార్కెట్‌లో కొనసాగుతున్న ఈ క్షీణత కారణంగా, ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే సమయంలో, బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ గ్లోబల్ ఈక్విటీస్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్, మార్కెట్లో కొనసాగుతున్న ఈ పతనంలో మదుపుదారులు తమకు ఇష్టమైన షేర్లను కొనుగోలు చేయడానికి ఒక సువర్ణావకాశంగా చెబుతున్నారు.
25
క్రిస్టోఫర్ వుడ్ గ్రీడ్ అండ్ ఫియర్ పేరుతో ఒక నోట్ రాశాడు. తన ఇటీవలి నోట్‌లో వుడ్ ఇలా అన్నారు -: పెట్టుబడిదారులు తమ అభిమాన షేర్లను క్షీణించినప్పుడు కొనుగోలు చేయడం ద్వారా మంచి క్వాలిటీ షేర్లను తక్కువ ధరకే ఒడిసి పట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. దీర్ఘకాలికం గురించి మాట్లాడినట్లయితే, ఈక్విటీల పరంగా ఆసియాలో భారతీయ మార్కెట్లు ఆకర్షణీయంగా తయారవుతున్నాయని వుడ్ తెలిపారు.
35
దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఇన్వెస్ట్ చేయండి...
మనీకంట్రోల్ పోర్టల్ నివేదిక ప్రకారం, క్రిస్టోఫర్ వుడ్ తన నోట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక పెద్ద సంస్కరణలు చేసిందని రాసుకొచ్చారు. ఈ సంస్కరణల బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ చేసిన సంస్కరణల మాదిరిగానే భవిష్యత్తులో మార్కెట్లలో సత్ఫలితాలు ఇస్తాయని అంచనా వేశారు.
45
ఆర్థిక సంస్కరణల ఫలితం లభిస్తుంది..
కోవిడ్ -19 నుండి ఆర్థిక వ్యవస్థకు షాక్ ఉన్నప్పటికీ, మోదీ ప్రభుత్వం తన సంస్కరణల ఎజెండాకు కట్టుబడి ఉందనిక్రిస్టోఫర్ వుడ్ చెప్పారు. దివాలా సంస్కరణలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. దీనికి ముందు, దేశంలోని బడా వ్యాపారులు లేదా ప్రమోటర్లు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేట్ పిగ్గీ బ్యాంకులుగా ఉపయోగించుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. రెండో దఫా మోడీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఖాతాలు చాలా వరకు క్లీన్ అయ్యాయి. అకౌంటింగ్ పరంగా బ్యాలెన్స్ షీట్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోయాయన్నారు.
55
వుడ్ తన నోట్‌లో ఇలా వ్రాశారు, "ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ స్థితి చాలా బలంగా ఉంది. బీజేపీ మరో 50 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని గ్రేడ్ అండ్ ఫియర్‌లో ఆయన రాశారు. ఈ అంచనా అతిశయోక్తి అయినప్పటికీ, బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో, వాస్తవిక అంచనాలు అలాగే ఉన్నాయని నోట్ ముగించారు.