ఒకప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లకు షాక్, ఒకే రోజు రూ. 500 పతనమైన స్టాక్ ధర, కారణం ఏమిటంటే..?

Published : Jan 05, 2023, 04:35 PM ISTUpdated : Jan 05, 2023, 05:43 PM IST

ఒకప్పుడు ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ కేవలం ఒకే రోజులో రూ. 500 పడిపోయింది, దీంతో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 30,000 కోట్లు నష్టపోయారు. అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ విడుదల చేసిన అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ ఫిగర్ మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉంది, ఇది పెట్టుబడిదారులలో నిరాశకు దారితీసింది. ఫలితంగా షేర్లలో భారీ పతనానికి దారితీసింది.

PREV
15
ఒకప్పుడు  బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లకు షాక్, ఒకే రోజు రూ. 500 పతనమైన స్టాక్ ధర, కారణం ఏమిటంటే..?

గడిచిన ఒక దశాబ్ద కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద మల్టీబ్యాగర్ స్టాక్ ఏదైనా ఉందంటే అది  బజాజ్ ఫైనాన్స్ అనే ట్రేడ్ పండితులు చెబుతుంటారు. కానీ ఈ ఫైనాన్స్ కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌లో భారీగా క్రాష్ అయ్యాయి. కేవలం ఒకే ట్రేడింగ్ సెషన్ లో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 8 శాతం అంటే  రూ. 500 పైగా పడిపోయాయి. 
 

25

నిజానికి నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో జనవరి 4, 2022న, బజాజ్ ఫైనాన్స్ షేర్ల ధర రూ. 6571 వద్ద ముగిసింది. కానీ గురువారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత, బీఎస్ఈలో ఈ షేరు విలువ ఏకంగా రూ.6,032కి పడిపోయింది. బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే దాదాపు రూ.  30 వేల కోట్లను నష్టపోయారు. దీంతో  స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా  రూ. 3.68 లక్షల కోట్లకు పడిపోయినట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు బజాజ్ స్టాక్ చరిత్రలో ఈ స్థాయిలో పతనం అవడం ఇదే తొలిసారి అనికూడా నిపుణులు పేర్కొంటున్నారు. 
 

35

బజాజ్ ఫైనాన్స్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) వృద్ధి విలువ  అంచనాల కంటే తక్కువగా ఉంది.  అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్  AUM వృద్ధి అంచనాల కంటే ఇది తక్కువగా ఉంది. అయితే పంపిణీ, ఉత్పత్తి విభాగాల్లో కంపెనీ వృద్ధి బలంగానే ఉంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో లేదా CRAR త్రైమాసిక ప్రాతిపదికన 25.1% వద్ద ఫ్లాట్‌గా ఉంది, ఇది బలహీన వృద్ధి రేటు, మూలధన వినియోగాన్ని తక్కువగా సూచిస్తుంది. త్రైమాసిక అప్‌డేట్ ప్రకారం, బజాజ్ ఫైనాన్స్ 2QFY23లో 26 లక్షల మంది కస్టమర్‌లను పొందగా, Q3లో 31 లక్షల మంది కొత్త కస్టమర్‌లను సంపాదించుకుంది.

45

బజాజ్ ఫైనాన్స్ FY23 మూడో క్వార్టర్ లో ప్రీ-క్వార్టర్ అప్‌డేట్ AUM వృద్ధిలో కొంత తగ్గుదల చూపుతుందని జెఫరీస్ పేర్కొంది. కొత్త లోన్ బుకింగ్‌లలో వృద్ధి కూడా 5 శాతం YOY( సంవత్సరం ప్రాతిపదికన) చూస్తే  నెమ్మదిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది షార్ట్ టర్మ్ సెక్యూరిటీ లెండింగ్ బిజినెస్ లేదా రిటైల్/SME లోన్‌ల వల్ల జరిగిందా, అనేది తెలియాల్సి ఉంది.  లేదా మరేదైనా ఇతర కారణమా అనేది చూడాలని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీ బలహీనమైన వృద్ధి సమీప కాలంలో స్టాక్‌పై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ కంపెనీ డిపాజిట్ బుక్ రూ.43,000 కోట్లుగా ఉంది.

55

బజాజ్ స్టాక్‌పై జెఫరీస్ హోల్డ్ రేటింగ్‌ను ఇచ్చింది, మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై బయ్ రేటింగ్‌ను కంటిన్యూ చేస్తోంది. స్టాక్ బయ్ ఆన్ డిప్స్ సూత్రం వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories