Business Ideas: ఉద్యోగం లేదని బాధపడవద్దు..ఈ బిజినెస్ చేస్తే రోజుకు 5 వేలు ఏటూ పోకుండా, మీజేబులో వచ్చి పడతాయి

First Published Jan 5, 2023, 12:08 PM IST

వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు కానీ ఏ వ్యాపారం చేయాలో తెలియక తికమక పడుతుంటారు అలాంటి వారి కోసమే ఈ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. 

ice cream melt

ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో వేడి అధికంగా ఉంటుంది పోలి ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఐస్ క్రీమ్ వ్యాపారం 365 రోజులు డిమాండ్ ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్క్రీమ్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. 

ice cream

దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేయాలనుకుంటే ముఖ్యంగా మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. మంచి మార్కెట్ స్థలం మీరు ఏర్పాటు చేసే ఐస్ క్రీమ్ పార్లర్ కాలేజీలు విద్యాసంస్థలు మార్కెట్ ఏరియా పార్కులు షాపింగ్ మాల్స్ సమీపంలో అయితే చాలా మంచిది అప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్లు వస్తుంటారు.

 ఐస్ క్రీమ్ పార్లర్ కు ముందు ఏర్పాటు చేయాలనుకుంటే మార్కెట్లోని లీడింగ్ బ్రాండ్ నుంచి ఫ్రాంచైజీ తీసుకుంటే మంచిది. వారి వద్ద నుంచి ఐస్క్రీమ్ తెచ్చుకుని మీరు డిఫరెంట్ ఫ్లేవర్ గా విక్రయించవచ్చు.  తద్వారా మీ వ్యాపారం అవుతుంది.  ప్రస్తుతం మార్కెట్లో క్వాలిటీ వాల్స్, అమూల్, దిన్షాస్,  అరుణ్ ఐస్ క్రీమ్,  బాస్కిన్ రాబిన్స్,  లాంటి అనేక బ్రాండ్స్ తమ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నాయి.

ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏర్పాటు చేసే ముందు మీరు ఎంపిక చేసుకున్న ప్లాన్ చేసేవారు మార్కెట్లోని బ్రాండ్ వాల్యూ ఎంత ఉందో ఎంక్వయిరీ చేసుకోవాలి.  అలాగే ఆఫర్ చేస్తున్నటువంటి ఐస్క్రీమ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి. 

ఐస్ క్రీమ్ పార్లర్ తో పాటు మిల్క్ షేక్ లు,  కూల్ డ్రింకులు, కేకులు, చాక్లెట్లు వంటివి అందుబాటులో ఉంచితే చాలా మంచిది. ఐస్ క్రీమ్ తో పాటు వీటి ద్వారా కూడా మీకు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది.  అలాగే ఐస్ క్రీమ్ పార్లర్ ద్వారా మీరు వేసవిలో ఎక్కువగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 
 

 మీరు ఎంపిక చేసుకున్న బ్రాండ్ను బట్టి ఐస్ క్రీమ్ మీద కమిషన్ పొందవచ్చు.  ఉదాహరణకు ₹100 ఐస్ క్రీమ్ విక్రయిస్తే మీకు అందులో,  కనీసం 30 నుంచి 40 రూపాయలు మిగులుతాయి.  ఐస్ క్రీమ్ వ్యాపారం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది.  ఐస్ క్రీమ్ పార్లర్ కు ఎక్కువగా యువత పిల్లలు వస్తారు. స్కూళ్లు కాలేజీల దగ్గరలో ఐస్ క్రీమ్ పార్లర్ పెడితే మంచిది. 
 

 అయితే ఐస్ క్రీమ్ పార్లర్ కు నిరంతరం విద్యుత్తు అవసరం కావున కరెంటు పోయినప్పుడు జనరేటర్ బ్యాకప్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే మీరు రిఫ్రజరేటర్ లో ఉంచిన ఐస్క్రీమ్  కరిగి పోయే ప్రమాదం ఉంది. 

నోట్:  పైన పేర్కొన్నటువంటి బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏషియానెట్ తెలుగు ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వదు. పైన పేర్కొన్నటువంటి ఆదాయాలు అంచనాలు మాత్రమే.  మీరు తీసుకునే నిర్ణయాలకు మీరే బాధ్యులు. 
 

click me!