ఐటీ శాఖ నోటీసు చూడగానే గుండె గుభేల్ అనిపిస్తోందా..అయితే షాక్ తినకండి..ఏం చేయాలో తెలుసుకోండి..?

Published : Jan 05, 2023, 03:46 PM IST

ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది అనగానే చాలా మందికి గుండె గుభేల్ అంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఐటీ నోటీసు అనగానే గాభరా పడిపోతుంటారు. కానీ అలా ఏమీ భయపడవద్దని నిపుణులు చెబుతున్నారు. ఐటీ నోటీసు వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. 

PREV
17
ఐటీ శాఖ నోటీసు చూడగానే గుండె గుభేల్ అనిపిస్తోందా..అయితే షాక్ తినకండి..ఏం చేయాలో తెలుసుకోండి..?

ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ  నుండి పన్ను చెల్లింపుదారులకు నోటీసులు రావడం అనేది చాలా సహజమైన విషయం.  మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత, మీకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి ఇన్టిమేషన్ నోటీసు వస్తే, భయపడకండి, ఈ నోటీసు ఎందుకు పంపారో, దాని పరిష్కారాన్ని  తెలుసుకోండి.
 

27

సాధారణంగా, ఒక వ్యక్తికి ఆదాయపు పన్ను నోటీసు వచ్చినప్పుడల్లా, అతను భయాందోళనకు గురవుతాడు. కానీ వ్యక్తి ఆదాయపు పన్ను నోటీసును ప్రశాంతంగా చదవాలి,  ఒక వ్యక్తి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇంటిమేషన్ నోటీసును పంపుతుంది. మీరు చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ IT రిటర్న్‌ని ఫైల్ చేసినట్లయితే, రెండు సందర్భాల్లోనూ టాక్స్ డిపార్ట్‌మెంట్ పన్ను చెల్లింపుదారులకు ఒక ఇన్టిమేషన్ నోటీసును పంపుతుంది.
 

37

ఈ నోటీసు ఎందుకు పంపుతున్నారు?
పన్ను చెల్లింపుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు బకాయి మొత్తం పన్ను చెల్లించి సమస్యలను పరిష్కరించడానికి ఇంటిమేషన్ నోటీసు  పంపుతారు. ఒక వ్యక్తి పన్ను కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తే, ఆ సందర్భంలో ఆదాయపు పన్ను శాఖ సంబంధిత పన్ను చెల్లింపుదారు ఖాతాకు అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది.

47

ఈ నోటీసు వస్తే ఏం చేయాలి..
పన్ను చెల్లింపుదారుకు ఆదాయపు పన్ను శాఖ ద్వారా నోటీసు వస్తే, తక్కువ పన్ను చెల్లించి ఉంటే, చెల్లించాల్సిన పన్ను బకాయిలను చెల్లించండి. ఉదాహరణకు మీ ఆదాయం ప్రకారం లక్ష రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం 90 వేల రూపాయలు మాత్రమే పన్ను చెల్లించి ఉంటే పన్ను బకాయిలను త్వరగా జమ చేయాలి. మరోవైపు, మీరు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను కంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు అదనపు మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది.

57

ఇన్టిమేషన్ నోటీసు అంటే ఏమిటి?
పన్ను చెల్లింపుదారు తన వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్‌ను సంవత్సరంలోని జూలై 31వ తేదీ లేదా అంతకు ముందు దాఖలు చేయాలి. రిటర్న్ దాఖలు చేసిన తర్వాత, ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్‌ను తనిఖీ చేస్తుంది. ఈ ప్రక్రియలో పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఏవైనా లోపాలు లేదా అక్రమాలు లేదా వ్యత్యాసాలు ఉన్నాయా అని ఆదాయపు పన్ను శాఖ ధృవీకరిస్తుంది. IT రిటర్న్‌లో లోపం కనుగొనబడితే, ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు నోటీసును పంపుతుంది, దీనిని సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ నోటీసు అని కూడా పిలుస్తారు.
 

67

ఈ ఇన్టిమేషన్ నోటీసు పన్ను చెల్లింపుదారు యొక్క రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి ఇన్టిమేషన్ నోటీసు పంపినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS కూడా వస్తుంది. 
 

77

నోటీసును స్పందిచకపోతే ఏమవుతుంది?
పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును స్వీకరించిన తర్వాత దానికి స్పందించకపోతే, అతను భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. ఇందులో జీతం నుండి TDS కట్ అవుతుంది. అప్పుడు మీరు తక్కువ జీతం పొందే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories