ఈ స్కింలో పెట్టుబడి పెడితే నెలకు లక్ష పెన్షన్.. ఎలాగో తెలుసా?

First Published | Jun 8, 2024, 8:14 PM IST

పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి  అనేక పెన్షన్ పథకాలను అమలు చేస్తుంది. వాటిలో ముఖ్యమైన పథకం NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) పథకం.
 

ఈ పథకం ఒక వ్యక్తి తన పదవీ విరమణ కోసం ఆదా చేయడంలో సహాయపడుతుంది. మీ పదవీ విరమణ ఆదాయాన్ని పెంచడానికి అలాగే  పన్ను ఆదా చేయడానికి NPS అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. సిస్టమాటిక్  సేవింగ్స్ తో ఆర్థికంగా సురక్షితమైన పదవీ విరమణ కోసం ప్లాన్ చేయడంలో NPS సహాయపడుతుంది.
 

కానీ NPS పథకం అన్ని కలిపి రాబడిని అందిస్తుంది కాబట్టి, ఎక్కువ పెట్టుబడి కాలం మీ రాబడిని వేగంగా పెంచుతుంది. NPS పథకం ద్వారా నెలకు 1 లక్ష రూపాయలు పెన్షన్‌గా ఎలా పొందాలో చూద్దాం.... ఒక వ్యక్తి 21 సంవత్సరాల వయస్సులో నెలకు రూ.8,700ను  ఎన్‌పిఎస్‌లో వచ్చే 39 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే, అతనికి 60 సంవత్సరాల వయస్సులోపు నెలకు రూ.1,00,000కు పైగా పెన్షన్ లభిస్తుంది.
 


nps 2.jpg

నెలకు లక్ష రూపాయల పెన్షన్ పొందాలంటే ఎన్‌పిఎస్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి ? 
21 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో నెలకు రూ.8,700 పెట్టుబడి పెట్టాలి. అతను ఈ పథకంలో 10 సంవత్సరాలకు పైగా పెట్టుబడి పెడితే, అతను తన పెట్టుబడిపై 10% రాబడిని పొందుతాడు. తద్వారా అతనికి మొత్తం రూ.5,01,19,582 లభిస్తుంది.

మీరు ఆ మొత్తం నుండి 60 శాతం తీసుకుంటే (రిటైర్‌మెంట్ వయస్సులో మీరు ఉపసంహరించుకునే గరిష్ట పరిమితి 60 శాతం), అప్పుడు మీకు 40 శాతం సంవత్సర ఆదాయం ఉంటుంది.
 

ఫిక్స్డ్  ఆదాయాన్ని ఆర్జించే డెట్ ఫండ్స్ లేదా కార్పొరేట్ బాండ్లలో ప్రభుత్వం ఆన్యుటీని పెట్టుబడి పెడుతుంది. మీరు ఆన్యుటీపై ఆరు శాతం రాబడిని పొందినట్లయితే, ఆన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 30,07,1749 ఉంటుంది. తద్వారా 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా  పెన్షన్‌గా రూ.1,00,239 పొందవచ్చు.

ఎన్‌పిఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుంది. అందువల్ల ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడి సలహాదారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
 

Latest Videos

click me!