మీరు రైలులో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తుంది. తాజాగా, రైల్వే యంత్రాంగం రైలులో ప్రయాణికులు నిద్రించే సమయాన్ని మార్చింది. కొత్త రూల్ ప్రకారం, రైలులో ప్రయాణీకుల నిద్ర సమయం గతంతో పోలిస్తే తగ్గింది.
ఇంతకుముందు ప్రయాణీకులు వారి ప్రయాణ సమయంలో 9 గంటల వరకు నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం, మీరు ఇప్పుడు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రించవచ్చు. గతంలో ఈ సమయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది. స్లీపింగ్ సౌకర్యం ఉన్న రైళ్లలో ఈ నిబంధనను అమలు చేసారు.
సుదూర ప్రయాణీకులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు రైల్వేశాఖ ఈ మార్పు చేసింది. 10 AM నుండి 6 AM మధ్య సమయం నిద్రకు సరైనదిగా పరిగణించబడుతుంది. ఈ నిబంధన అమల్లోకి రాకముందు మిడిల్ బెర్త్‌లో కూర్చున్న ప్రయాణికులు రాత్రి త్వరగా నిద్రపోతున్నరని, అలాగే తెల్లవారుజాము7 లేదా 8 వరకు నిద్రపోతున్నారని వాపోయారు.
దీంతో లోయర్ బెర్త్ లేదా కింది సీట్లో కూర్చున్న ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ప్రయాణికుల మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. దింతో ఇప్పుడు నిద్ర సమయం కొత్తగా సెట్ చేయబడింది, ప్రయాణికులు ఎలాగైనా ఉదయం 6 గంటలకే నిద్ర లేవాలి. ఈ నిబంధన ప్రకారం ప్రయాణికులు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు.
నిజానికి మిడిల్ బెర్త్ ఎక్కువసేపు తెరిచి ఉంటే, కింద బెర్త్‌లోని ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారు. ఉదయం 6 గంటలకు మధ్యలో ఉన్న సీటును క్లోజ్ చేయడం అవసరం. అలాగే, మీరు లోయర్ బెర్త్ సీటుకు మారాలి. అలా చేయడంలో విఫలమైతే మీపై చర్య తీసుకోవచ్చు.
కొత్త రూల్ ప్రకారం, లోయర్ బెర్త్‌లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు రాత్రి 10 గంటలలోపు లేదా ఉదయం 6 గంటల తర్వాత వారి సీట్లలో పడుకోకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రయాణికులు రైల్వే శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.