నెలవారీ జీతాన్ని బట్టే కారును కొనుక్కోవాలి. 50,000 రూపాయల జీతం ఉన్నవారు కూడా హ్యుండాయ్ క్రెటా కారును (Hyundai Creta) సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి..వంటి వాటిని తెలుసుకోండి.
హుండాయ్ క్రెటా మనదేశంలోనే అత్యంత ఇష్టమైన ఎస్‌యూవీ మోడల్ కార్లలో ఒకటి. జిఎస్టి తగ్గిన తర్వాత దీని ప్రారంభ ధర కూడా తగ్గిపోయింది. 10,72,589 రూపాయలుగా ప్రస్తుతం ఉంది. దీంతోపాటు మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు ఛార్జీలు రూ.1,25,335 చెల్లించాలి. అలాగే బీమా కోసం రూ.54,995 చెల్లించాలి. ఇతర ఛార్జీలు కలిపితే రూ.11,525 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఆన్ రోడ్ ధర రూ.12,64,444 చెల్లించాలి. పండుగ సీజన్లో కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
25
డౌన్ పేమెంట్ ఎంత?
క్రెటా కారును కొనేందుకు మీరు కనీసం రెండు లక్షల డౌన్ పేమెంట్ సిద్ధం చేసుకోవాలి. ఇక మిగిలిన మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలి. అంటే రూ.10,64,444 రుణం తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఐదేళ్లకి అంటే 60 నెలలకి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. లోన్ కోసం 10 శాతం వడ్డీతో రుణం వస్తుంది. నెలవారీ వాయిదాగా రూ. 22,616 రూపాయలు చెల్లించాలి.
35
మీ జీతం ఎంత ఉండాలి?
హ్యాండాయ్ క్రెటాను సొంతం చేసుకోవాలంటే మీ జీతం చేతికి 50 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయలు తగ్గకుండా ఉండాలి. అప్పుడే మీరు నెలకు 22,616 రూపాయలను ఈఎంఐగా చెల్లించగలరు. క్రెటాను సులభంగా కొనుగోలు చేయగలరు.
హ్యుండాయ్ క్రెటా కారులో ఫీచర్లు అధికంగానే ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 360 డిగ్రీస్ లో కెమెరా ఉంటుంది. 10.25 అంగుళాలు స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్లు... ఇందులో ఉంటాయి. క్రెటా మూడు వేరియంట్లలో వస్తుంది 1.5 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వంటి వేరియంట్లలో లభిస్తుంది.
55
మైలేజీ ఎంత?
క్రెటా మైలేజీ కూడా ఎక్కువే. మిగతా ఎస్‌యూవీలతో పోలిస్తే క్రెటా మైలేజీ ఉత్తమమైనదనే చెప్పుకోవాలి. ఒక లీటర్ పెట్రోల్ తో 21 నుంచి 22 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హై రైడర్ వంటి వాటితో పోటీ పడుతుంది.